- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం
- టీ20ల్లో భారత బ్యాటర్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (181) నమోదు
- కేఎల్ రాహుల్ (152 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును అధిగమించిన ప్రియాన్ష్
- ఒకే ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డును సమం చేసిన వైనం
- టీ20ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు
దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య సరికొత్త చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి టీ20 ఫార్మాట్‌లో ఓ భారత బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. డేలీ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రియాన్ష్ కేవలం 68 బంతుల్లోనే 181 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో ప్రియాన్ష్ 19 సిక్సర్లు, 7 ఫోర్లు బాదడం విశేషం. ఈ క్రమంలో ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ సాధించిన 152 పరుగుల రికార్డును ప్రియాన్ష్ బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను 18 బంతుల్లో అర్ధశతకం, 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఈ స్కోరు టీ20 క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. గత నెల సీఎస్ఏ ప్రో20 కప్‌లో టైటాన్స్ తరఫున లూన్-డ్రే ప్రిటోరియస్ సాధించిన 188 నాటౌట్ పరుగుల తర్వాత ఇదే అత్యధికం. అంతేకాకుండా ఒకే ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు బాది ఫిన్ అలెన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ప్రియాన్ష్ సమం చేశాడు.
అతని విధ్వంసంతో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 275 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో మూడో అత్యధిక జట్టు స్కోరు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఔటయ్యాడు.