‘‘నన్ను క్షమించండి.. మీకు రెండోసారి మరింత మంచి సీఈవోగా ఉంటా!’’ అంటూ ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్ భావోద్వేగానికి లోనయ్యారు. వివాదాల సుడిగుండంలో చిక్కుకుని రాజీనామా చేసిన కేవలం 11 రోజుల్లోనే ఆయన తిరిగి కంపెనీ పగ్గాలు చేపట్టారు. కాలిఫోర్నియా శాంటాక్లారాలోని ఎన్విడియా ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టిన 63 ఏళ్ల హువాంగ్‌కు ఉద్యోగులు నీరాజనాలు పలికారు. "జెన్సన్.. జెన్సన్" అంటూ నినాదాలు చేస్తూ, నిలబడి చప్పట్లతో ఘన స్వాగతం పలికారు.

ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలను ఎన్విడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మింగ్-యు లియూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఉద్యోగుల అభిమానానికి ఉప్పొంగిపోయిన హువాంగ్.. తన గుండెలపై చేయి వేసుకుని వినమ్రంగా మాట్లాడారు. "ఇది నా మొదటి పని దినం లాంటిది. నా వల్ల మీరంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకు నిజంగా క్షమాపణలు కోరుతున్నా. నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈసారి మరింత మెరుగైన సీఈవోగా నిరూపించుకుంటా" అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తన దగ్గర కంప్యూటర్ కూడా లేదని, ఐటీ విభాగం కొత్త పీసీ ఇవ్వాల్సి ఉందని చమత్కరించారు. మరోవైపు ఎన్విడియా ఏఐ అధికారిక ఖాతా సైతం ‘ఆయన వచ్చేశాడు’ అంటూ పోస్ట్ పెట్టింది.

హువాంగ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని గత వారమే తేల్చిచెప్పిన ఎన్విడియా బోర్డు.. చివరకు దిగిరాక తప్పలేదు. ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సోమవారం ఉదయమే అనూహ్య నిర్ణయం ప్రకటించింది. హువాంగ్ రాకతో కంపెనీ షేర్ల విలువ ఏకంగా 32 శాతం ఎగబాకింది.

సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ క్లౌడ్ కంపెనీ డైరెక్టర్, చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో పాటు మరో ఇద్దరు ఎన్విడియా ఉద్యోగినులతో హువాంగ్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో వివాదం రాజుకుంది. జాతీయ భద్రతా కారణాలతో పాటు బోర్డు ఆయనపై విశ్వాసం కోల్పోవడంతో నవంబర్ 12న రాజీనామా చేశారు. తాత్కాలిక సీఈవోగా సీఎఫ్‌వో కొలెట్ క్రెస్ బాధ్యతలు చూశారు. కొత్త బాస్ కోసం ఆర్మ (Arm) సీఈవో రెనె హాస్‌ను సంప్రదించగా.. ఆయన తన సంస్థతోనే 2033 వరకు ఒప్పందం పొడిగించుకున్నారు. ఆ ప్రకటన వచ్చిన రెండు గంటల్లోనే ఎన్విడియా బోర్డు సమావేశమై హువాంగ్‌ను ఏకగ్రీవంగా తిరిగి నియమించింది.