- శర్వానంద్ భుజంపై డింపుల్ హయతి తలవాల్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్
- డింపుల్ హయతికి వివాహమైందంటూ కామెంట్ చేసిన నెటిజన్
- తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ స్పష్టతనిచ్చిన నటి
టాలీవుడ్ నటి డింపుల్ హయతి తన వైవాహిక జీవితంపై వస్తున్న ప్రచారానికి తెరదించారు. తనకు ఇంకా వివాహం కాలేదని ఆమె స్పష్టం చేశారు. శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన ‘భోగి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో, ఈ అంశంపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన ‘భోగి’ చిత్ర ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ వేడుకకు చిత్ర బృందం హాజరైంది. ఈ కార్యక్రమంలో శర్వానంద్ భుజంపై డింపుల్ హయతి చనువుగా తల వాల్చి నవ్వుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన ఒక నెటిజన్.. శర్వానంద్‌కు పెళ్లయినట్లే డింపుల్ హయతికి కూడా వివాహం జరిగిపోయింది కదా అంటూ కామెంట్ చేశాడు.
ఆ కామెంట్‌పై డింపుల్ హయతి నేరుగా స్పందిస్తూ... "నాకు ఇంకా పెళ్లి కాలేదు" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో సమాధానమిచ్చారు. గతంలో చోటుచేసుకున్న కొన్ని వివాదాల సమయంలో విక్టర్ డేవిడ్ అనే వ్యక్తిని ఆమె భర్తగా కొన్ని వార్తా కథనాల్లో పేర్కొన్నారు. దీంతో చాలామంది ఆమెకు పెళ్లయిపోయిందని భావించారు. తాజాగా డింపుల్ స్వయంగా స్పందించడంతో ఆ వదంతులకు ముగింపు పడింది.
మరోవైపు, సంపత్ నంది దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'భోగి' చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.