- ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు రూ.50 నుంచి రూ.60 లక్షల ఆస్తి ఇస్తున్నామన్న పొంగులేటి
- ఇందిరమ్మ టవర్స్‌కు టీజీ రెరా గుర్తింపు లభించిందని వెల్లడి
- హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్న మంత్రి
హైదరాబాద్ లో పేదలకు సొంతిల్లు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి దాదాపు రూ.50 నుంచి రూ.60 లక్షల విలువైన ఆస్తిని సమకూర్చడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇందిరమ్మ టవర్స్‌కు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా)లో రిజిస్ట్రేషన్ పూర్తి కావడం ఒక కీలక ముందడుగు అని, ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారిగా రెరాలో నమోదు కావడం ప్రజా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదల కోసం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో దాదాపు లక్ష ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి దశలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో చేపట్టిన ఇందిరమ్మ టవర్లకు రెరా అనుమతులు లభించాయి. ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడమే కాకుండా, లబ్ధిదారుల పేరిట అవిభక్త భూమి వాటాను (యూడీఎస్) నమోదు చేయనుంది.
ఈ ప్రాజెక్టుకు రెరా చట్టబద్ధమైన గుర్తింపు రావడంతో లబ్ధిదారుల హక్కులకు పూర్తి భద్రత లభించనుంది. అంతేకాకుండా, లబ్ధిదారులు తమ వాటా సొమ్ము చెల్లించడానికి బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందడం మరింత సులభతరం అవుతుంది. నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి, లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్లను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.