- 13 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల
- పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు అధికారికంగా ఉమ్మడి ప్రకటన విడుదల
- అక్టోబర్ చివర్లోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన అన్నా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. పరస్పర అంగీకారం, గౌరవంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. 2013 సెప్టెంబర్‌లో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
తమ ప్రకటనలో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల స్పందిస్తూ... "జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రయాణాన్ని పంచుకున్న తర్వాత, పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా వివాహ బంధం ముగిసినప్పటికీ, మంచి స్నేహితులుగా, మా పిల్లలకు బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతాం. పిల్లల ఆనందం, వారి భవిష్యత్తు, శ్రేయస్సే మా ఉమ్మడి ప్రాధాన్యత. జీవితంలో చోటుచేసుకున్న ఈ వ్యక్తిగత మార్పు సమయంలో మా నిర్ణయాన్ని అర్థం చేసుకుని, మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం. ఇప్పటివరకు మా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని తెలిపారు. ఈ దంపతులకు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పొలెనా అంజనా పవనోవా ఉన్నారు.
మరోవైపు, గత అక్టోబర్ నెలాఖరులో అన్నా కొణిదెల తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను అకస్మాత్తుగా డీయాక్టివేట్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమె ఖాతా కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ, అప్పట్లో ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా వీరి విడాకుల ప్రకటన వెలువడటంతో, అన్నా కొణిదెల అప్పట్లో సోషల్ మీడియాకు దూరమవడానికి కారణం ఇదేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.