ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను విజయవాడ నగర నూతన మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. వంగవీటి రాధాకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.

విజయవాడ మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా పవన్ కల్యాణ్‌ను కలిసిన రాధాకృష్ణ, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భేటీ ఎంతో ఆత్మీయ వాతావరణంలో సాగింది. నూతనంగా మేయర్ బాధ్యతలు చేపట్టనున్న వంగవీటి రాధాకృష్ణకు పవన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే రాధాకృష్ణ కుటుంబ సభ్యులను ఆయన ఆప్యాయంగా పలకరించారు.

విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 
20261110fra84c41b644c7.jpg20261110fre1289572a123.jpg20261110frd2f9b200f10d.jpg20261110fred6864747be8.jpg20261110fr9702bf9aaa6a.jpg20261110fr056f2d5d2a2c.jpg