- 'అప్పా కుట్టి' సినిమా ప్రమోషన్ల కోసం రైలు జనరల్ బోగీలో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ
- చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే కోవై ఎక్స్ప్రెస్లో ప్రయాణికులతో ముచ్చట్లు
- ప్రయాణానికి సంబంధించిన విశేషాలతో స్పెషల్ ట్రావెల్ వ్లాగ్ చిత్రీకరణ
- కోయంబత్తూరులోని థియేటర్లను సందర్శించి నేరుగా ప్రేక్షకుల స్పందన తెలుసుకోనున్న నటుడు
- నవంబర్ 20న విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటున్న చిత్రం
ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ తన సరికొత్త చిత్రం 'అప్పా కుట్టి' ప్రమోషన్స్ కోసం వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. సినిమాను సామాన్య ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన రైలులోని అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించి అందరి దృష్టినీ ఆకర్షించారు.
చెన్నై నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరే కోవై ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగీలో విజయ్ ఆంటోనీ శనివారం కోయంబత్తూరుకు ప్రయాణమయ్యారు. ఏమాత్రం హంగూ ఆర్భాటం లేకుండా సాధారణ ప్రయాణికులతో కలిసి కూర్చుని ప్రయాణించడం విశేషం. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన తన తోటి ప్రయాణికులతో సరదాగా ముచ్చటిస్తూ, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భాలను ప్రత్యేకంగా ఒక 'ట్రావెల్ వ్లాగ్'గా రికార్డ్ చేస్తున్నారు. ప్రయాణికుల స్పందనలు, ఆసక్తికర క్షణాలతో కూడిన ఈ వీడియోను చిత్ర ప్రచారంలో భాగంగా త్వరలోనే విడుదల చేయనున్నారు. కోయంబత్తూరు చేరుకున్నాక అక్కడి పలు థియేటర్లను సందర్శించి, ప్రేక్షకులను నేరుగా కలిసి సినిమాపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ జంటగా నటించిన ఈ భావోద్వేగ భరిత చిత్రానికి ము మారన్ దర్శకత్వం వహించారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే లాభాలను నమోదు చేసుకుంది.
కాగా, కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తమ పెద్ద కుమార్తె మీరా మరణం తర్వాత విజయ్ ఆంటోనీ చెప్పులు వేసుకోవడం పూర్తిగా మానేశారని, ఖరీదైన వాచ్‌లను వదిలేసి ఆమె వాడిన ₹4000 వాచ్‌ను మాత్రమే ధరిస్తున్నారని ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.