- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత
- కుమారుడికి 'దేవ్ నిడిమోరు' అని పేరు పెట్టిన దంపతులు
- ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నామన్న సామ్
ప్రముఖ సినీ నటి సమంత జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సమంత, ఆమె భర్త ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
తమకు బాబు పుట్టిన ఆనందాన్ని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 19న బాబు జన్మించాడని తెలుపుతూ, తమ కుమారుడికి 'దేవ్ నిడిమోరు' అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారి వేలు పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మా హృదయాలు ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్న సమయమిది’’ అంటూ మాతృత్వపు మధుర క్షణాలను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2026 జూన్‌లో 'మా ఇంటి బంగారం' చిత్ర సక్సెస్ మీట్ సందర్భంగా తాను గర్భవతి అనే విషయాన్ని సమంత ప్రకటించారు.
తమ జీవితంలోకి కొత్త సభ్యుడు రావడంతో ఆ దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సమంత తల్లి అయిన విషయం తెలుసుకున్న నయనతార, వరుణ్ ధావన్, కియారా అద్వానీ, తమన్నా తదితర చిత్ర పరిశ్రమ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.