- నాగార్జునసాగర్ బోటు ప్రయాణంలో మొదటి పరిచయం
- రాజకీయ విభేదాలతో పెళ్లిని నిరాకరించిన పెద్దలు
- గీతను ఢిల్లీ పంపించిన కుటుంబ సభ్యులు
- 1750 కిలోమీటర్లు బైక్ నడిపి ఢిల్లీ చేరిన రేవంత్
- జైపాల్‌రెడ్డిని స్వయంగా ఒప్పించి పెళ్లి
రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే దూకుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెరవెనుక ఒక సాహసోపేతమైన ప్రేమికుడు కూడా ఉన్నారనే సంగతి తెలుసా? ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకునేందుకు ఏకంగా బైక్‌పై 1,750 కిలోమీటర్లు ప్రయాణించి దేశ రాజధాని ఢిల్లీ చేరిన నాటి ముచ్చట్లను ఆయన తాజాగా పంచుకున్నారు.
నాగార్జునసాగర్ పరిసరాల్లో మొదలైన ఈ ప్రేమ బంధం రాజకీయ అడ్డంకులను దాటుకుని పెళ్లి పీటల వరకు ఎలా చేరిందో ఆయన స్వయంగా వెల్లడించారు.
విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో నాగార్జునసాగర్ డ్యామ్‌లో బోటు ప్రయాణం చేస్తూ గీతారెడ్డిని మొదటిసారి చూశానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారిందని వెల్లడించారు.
అయితే రెండు కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరాలు, నేపథ్యాల కారణంగా ఆమె కుటుంబం వీరి పెళ్లికి ససేమిరా అంగీకరించలేదు. వివాహాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో గీతారెడ్డిని ఆమె పెద్దనాన్న, అప్పటి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్. జైపాల్‌రెడ్డి వద్దకు ఢిల్లీకి పంపించేశారు.
ఈ పరిణామంతో వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి, తన ప్రేమను గెలిపించుకోవడానికి అప్పట్లోనే అత్యంత సాహసోపేతమైన అడుగు వేశారు. ఢిల్లీలో ఉన్న గీతారెడ్డిని కలుసుకోవడంతో పాటు జైపాల్‌రెడ్డిని స్వయంగా ఒప్పించేందుకు ద్విచక్ర వాహనంపై సుదీర్ఘ యాత్ర చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 1,750 కిలోమీటర్లు బైక్ నడుపుకుంటూ ఢిల్లీ చేరుకుని, అక్కడ జైపాల్‌రెడ్డిని కలిసి తన నిశ్చయాన్ని వివరించి ఆయనను ఒప్పించగలిగారు.
పెద్దలందరి ఆమోదంతో 1992 మే 7న వీరి వివాహం జరిగింది. నాగార్జునసాగర్ వద్ద జరిగిన వరుణ యాగంలో భార్యతో కలిసి పాల్గొన్న సీఎం, నాటి మధుర స్మృతులను నెమరువేసుకోవడంతో మూడు దశాబ్దాల క్రితం నాటి ఈ రొమాంటిక్ స్టోరీ మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది.