- వ్యక్తిత్వ హననంపై న్యాయపోరాటం చేస్తానన్న రుక్మిణి కోట
- సంస్థ ఉద్యోగి చేసిన మోసంపై ముందే పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడి
- ఫిర్యాదు చేసిన తననే నిందితురాలిగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన
- పవన్ కల్యాణ్ పేరును వివాదాల్లోకి లాగుతున్నారంటూ ఆగ్రహం
- చివరివరకూ జనసైనికురాలిగానే కొనసాగుతానని స్పష్టీకరణ
జనసేన పార్టీ నాయకురాలు రుక్మిణి కోట తనపై సాగుతున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో స్పందించారు. కొన్నేళ్లుగా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు, వ్యక్తిగత జీవితంపై కట్టుకథలు అల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అయితే తన మౌనాన్ని బలహీనతగానో లేదా ఓటమిగానో భావించవద్దని స్పష్టం చేశారు. చట్టం ద్వారానే న్యాయం కోసం పోరాడతానని పేర్కొంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల తన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తీవ్రమైన ఉద్యోగ నియామకాల మోసానికి పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందని రుక్మిణి కోట తెలిపారు. తన పేరును, కంపెనీ గుర్తింపును, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేస్తూ ఆ ఉద్యోగి ఆర్థిక లబ్ధి పొందారని వివరించారు. ఈ వ్యవహారాలన్నీ అధికారిక పనివేళల తర్వాత, తన ప్రమేయం, అనుమతి లేకుండానే జరిగాయని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇచ్చి, అంతర్గత విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగించామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సంబంధిత పోలీసు అధికారులకు చట్టపరంగా తానే అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
వాస్తవాలు ఇలా ఉంటే, మోసానికి పాల్పడిన వారిని వదిలేసి, ఫిర్యాదుదారురాలైన తనను నిందితురాలిగా చిత్రీకరించేందుకు కొందరు రాజకీయ నాయకులు, కొన్ని మీడియా వేదికలు ప్రయత్నించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ గౌరవాన్ని సమాజం కాపాడాలని, తప్పుడు కథనాలు, నిరాధార ఆరోపణలతో నిజం వైపు నిలబడే మహిళ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, జనసేన వీరమహిళల స్ఫూర్తితో తాను అన్యాయంపై పోరాడతానని తెలిపారు.
ఈ వ్యవహారంలోకి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరును ఉద్దేశపూర్వకంగా లాగుతున్నారంటూ రుక్మిణి కోట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, 2009లో ప్రజా రాజ్యం పార్టీ సమయం నుంచి ఇప్పటివరకు పవన్ కల్యాణ్ నాయకత్వం, ఆయన ఆశయాలకు కట్టుబడి పనిచేస్తున్నానని వివరించారు. ఆ నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు.
ధర్మ మార్గంలో సవాళ్లు, ఆటంకాలు సహజమని పవన్ కల్యాణ్ నుంచి తాను నేర్చుకున్నానని, ఆయన పట్టుదల, సహనమే తనకు ఆదర్శమని రుక్మిణి పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దాచడానికి ఏమీ లేదని స్పష్టం చేస్తూ.. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తేల్చిచెప్పారు. ఎప్పటికీ తాను నిబద్ధత కలిగిన జనసైనికురాలినేనని ఆమె ఉద్ఘాటించారు.