- తాడిపత్రిలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు
- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులే దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపణ
- పరిస్థితి విషమించకుండా తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ ఈ పరిణామం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పెద్దారెడ్డి నివాసానికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో పాటు పార్కింగ్‌లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. పెట్రోల్ బాంబులు విసిరి విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో ఇంటి కిటికీల అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంటి ఆవరణతో పాటు బయట నిలిపి ఉంచిన సుమారు 10 స్కార్పియో కార్లు, 20 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని జనరేటర్‌ను కూడా నిప్పంటించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
మరోవైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. స్థానిక ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సమీప గ్రామాల్లో పర్యటించి పార్టీ శ్రేణులను పరామర్శించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.
పట్టణంలో పరిస్థితి చేజారకుండా పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.