- ఈపీఎఫ్ఓ సరికొత్త సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ ఆమోదం
- పదవీ విరమణ తర్వాత నెల, 3 లేదా 6 నెలలకోసారి పింఛన్లా ఆదాయం
- విత్‌డ్రా కాని మిగిలిన నిల్వపై ఈపీఎఫ్ వడ్డీ లెక్కింపు
- పీఎఫ్ ఖాతాలో కనీస నిల్వ పరిమితి 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
- ఉద్యోగం కోల్పోయిన వారికి పూర్తి పీఎఫ్ సెటిల్మెంట్ గడువు 2 నెలలకు కుదింపు
పదవీ విరమణ తర్వాత లేదా ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాలోని సొమ్మును ఎలా పొందాలనే అంశంపై ఉద్యోగుల్లో ఎప్పుడూ ఆసక్తీ, ఆందోళనా రెండూ ఉంటాయి. కష్టపడి కూడబెట్టిన సొమ్ము అవసరమైన సమయానికి చేతికందుతుందా లేదా నిబంధనల ఉచ్చులో చిక్కుకుంటుందా అనే సందిగ్ధతకు ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయాలతో తెరదించింది. ఉద్యోగుల ఆర్థిక అవసరాలు, విరమణ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పీఎఫ్ విత్‌డ్రా, సెటిల్మెంట్ విధానాల్లో విప్లవాత్మకమైన మూడు భారీ మార్పులను ఖరారు చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.
నెలకు పింఛన్ లాంటి ఆదాయం
రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్ నిధి మొత్తాన్ని ఒకేసారి మొత్తంగా తీసుకోవాల్సిన పాత పద్ధతికి సరికొత్త ప్రత్యామ్నాయం వచ్చింది. ఉద్యోగుల కోసం సరికొత్త సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (SWP) సదుపాయం రానుంది. దీని ప్రకారం విరమణ అనంతరం ఖాతాదారులు తమ అవసరాన్ని బట్టి నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధవార్షిక వాయిదాల రూపంలో నిర్దిష్ట మొత్తాన్ని తీసుకోవచ్చు.
మిగిలిన మొత్తంపై ఈపీఎఫ్ వడ్డీ రేటు యథావిధిగా వర్తిస్తుంది. ఇది స్వచ్ఛంద నిర్ణయం మాత్రమే కావడంతో ఒకేసారి లంప్సమ్ సొమ్ము తీసుకోవాలనుకునే వారికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ప్రాథమిక దశలో 55 ఏళ్లు దాటిన దాదాపు 6.32 లక్షల మంది ఉద్యోగులకు ఇది వరంగా మారనుంది. అయితే, ఇది ఈపీఎస్ పెన్షన్‌కు ప్రత్యామ్నాయం కాదని, ఉద్యోగి వ్యక్తిగత పీఎఫ్ నిధి నుంచి పొందే ఆదాయమని గుర్తించాలి.
90 శాతం వరకు నగదు ఉపసంహరణ
గతంలో అత్యవసర సమయాల్లో పాక్షిక విత్‌డ్రావల్స్ కోసం దరఖాస్తు చేస్తే ఖాతాలో కనీసం 25 శాతం నిల్వ ఉంచాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని భారీగా కుదిస్తూ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిబంధనను 10 శాతానికి తగ్గించారు. ఫలితంగా ఉద్యోగులు తమకు అర్హత ఉన్న నిధి నుంచి ఏకంగా 90 శాతం వరకు నగదును ఉపసంహరించుకోవచ్చు.
ఉదాహరణకు పీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షల బ్యాలెన్స్ ఉంటే, గతంలో రూ.2.5 లక్షలు తప్పనిసరిగా ఖాతాలో ఉంచి గరిష్ఠంగా రూ.7.5 లక్షలే పొందే వీలుండేది. తాజా నిర్ణయంతో రూ.1 లక్ష ఉంచి ఏకంగా రూ.9 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇళ్ల నిర్మాణం, పిల్లల ఉన్నత చదువులు, వైద్య ఖర్చుల కోసం నిధుల కొరత ఎదుర్కొనే ఉద్యోగులకు ఇది ఊరటనిస్తుంది.
ఉద్యోగం పోయిన 2 నెలలకే పూర్తి సెటిల్మెంట్
ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా అనుకోకుండా కెరీర్లో బ్రేక్ వచ్చినప్పుడు పీఎఫ్ ఖాతాలోని పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి గతంలో ఏడాది పాటు ఎదురుచూడాల్సి వచ్చేది. ఆ నిబంధనను పూర్తిగా మార్చివేస్తూ నిరీక్షణ కాలాన్ని కేవలం రెండు నెలలకు కుదించారు.
ఉద్యోగం వదిలి రెండు నెలల పాటు ఖాళీగా ఉన్న సభ్యులు పూర్తి పీఎఫ్ సొమ్మును సెటిల్ చేసుకోవచ్చు. అయితే ఈపీఎస్ పెన్షన్ నిధులకు వర్తించే 36 నెలల వెయిటింగ్ పీరియడ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయాలు అధికారికంగా అమల్లోకి రావడానికి కార్మిక శాఖ నోటిఫికేషన్‌తో పాటు ఆదాయపు పన్ను చట్టంలో సంబంధిత మార్పులు రావాల్సి ఉంది.