- సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
- ప్రభుత్వంపై విమర్శలు చేసేవారికి పిచ్చికుక్కలు కరిచాయా? అని ప్రశ్న
- అలాంటి వారిని ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపాలని కార్యకర్తలకు సూచన
- హరీశ్‌రావును ఓడించిన వారికి మంత్రి పదవి ఇస్తానని ప్రకటన
- సిద్దిపేట సభలో ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ పథకం ప్రారంభం
తెలంగాణ కాంగ్రెస్‌లో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న కొందరు ఎమ్మెల్యేల తీరును ఆయన తప్పుబట్టారు. అటువంటి వారికి "పిచ్చికుక్కలు కరిచాయా?" అని ప్రశ్నించిన రేవంత్.. వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలిస్తారని హెచ్చరించారు. గురువారం సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొందరు నేతలు మైకుల ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం పనితీరును ప్రశంసిస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. "మంచి విషయాలను మైకుల్లో చెప్పాలి, లోపాలను వ్యక్తిగతంగా చర్చించాలి. కానీ కొందరు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు" అని చురకలంటించారు.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఎవరి పేర్లనూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఇటీవల నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే రేవంత్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదే సభలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేటలో హరీశ్‌రావును ఓడించిన కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను కొల్లగొట్టిందని ఆరోపించిన సీఎం, ప్రాజెక్టుల అంశంపై కేసీఆర్, హరీశ్‌రావులతో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఈ వేదిక నుంచే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే "ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్" పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.