- కొత్తూరు బైపాస్ వద్ద కోళ్ల డీసీఎంను వెనుక నుంచి ఢీకొన్న కారు
- ప్రమాదంలో వెంకట్ దంపతులకు స్వల్ప గాయాలు
- తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
- కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన, ఆయన భార్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బల్మూరి వెంకట్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొత్తూరు బైపాస్‌లోని దర్గా చౌరస్తా సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు, ముందు వెళ్తున్న కోళ్ల లోడు డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాద సమయంలో కారులో వెంకట్‌తో పాటు ఆయన భార్య, సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. ఈ ఘటనలో వెంకట్ దంపతులకు స్వల్ప గాయాలు కాగా, ఆయన సోదరుడు, డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. పెను ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.