- కర్ణాటకలో బైక్ ట్యాక్సీల రద్దు పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- నిషేధం కంటే నిబంధనలతో నియంత్రించడమే ఉత్తమమని స్పష్టీకరణ
- బైక్ ట్యాక్సీలపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థన
- జీపీఎస్ వ్యవస్థతో యువతులకు బైక్ ప్రయాణమే సురక్షితమన్న న్యాయమూర్తి
- ఆటోలతో పోల్చితే బైక్ ట్యాక్సీలు ఐదు రెట్లు చవకని ప్రస్తావన
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని సమర్థిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిషేధించడం కంటే నియంత్రించడమే సరైన మార్గమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని రద్దు చేస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషన్ను తోసిపుచ్చిన అనంతరం జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. "జీపీఎస్ సౌకర్యం ఉండటం వల్ల యువతులకు బైక్ ట్యాక్సీలు మరింత సురక్షితం. వీటిని పూర్తిగా నిషేధించే బదులు నిబంధనలతో నియంత్రించడం మేలు. ఇప్పటికే దేశంలోని 25 రాష్ట్రాల్లో ఇవి నడుస్తున్నాయి. మా ఆఫీసులోని యువతులను ఎలా ప్రయాణిస్తున్నారని అడిగితే బైక్ ట్యాక్సీల్లోనే వస్తున్నామని చెప్పారు. ఆటోలతో పోలిస్తే ఇది ఐదు రెట్లు చవక అని వారు తెలిపారు" అని జస్టిస్ శర్మ వ్యాఖ్యానించారు.
గతంలో ఓలా, ఉబెర్, రాపిడో వంటి అగ్రిగేటర్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్, వాహనాలను ట్రాన్స్పోర్ట్ కేటగిరీ కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని, నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ క్యారేజీలుగా అనుమతులు పరిశీలించాలని స్పష్టం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా చుక్కెదురైంది.