- కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల పంపకాలపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
- కొడంగల్, మధిర, హుజూర్‌నగర్‌లకే పెద్దపీట వేస్తున్నారని విమర్శ
- కొడంగల్‌కు రూ. 10 వేల కోట్లు కేటాయించారన్న మునుగోడు ఎమ్మెల్యే
- ఫ్లోరైడ్ పీడిత మునుగోడుకు రూ.500 కోట్లు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ధ్వజం
- సీఎం వాడే భాష సరికాదంటూ మండిపాటు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ సర్కారుపైనే తీవ్ర అసంతృప్తి స్వరం వినిపిస్తూ కాంగ్రెస్‌లో మరోసారి ప్రకంపనలకు తెరలేపారు. నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల మంజూరులో ముఖ్యమంత్రి, మంత్రులు తీవ్రమైన పక్షపాతం చూపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలను పరిష్కరించి రావలసిన వాటా నిధులు కేటాయించకపోతే రాబోయే రోజుల్లో సర్కారుతో ‘కురుక్షేత్రం’ తప్పదని తేల్చిచెప్పారు. మునుగోడులో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, పాలన తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకే నిధులు కుమ్మరించారని రాజ్‌గోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ అదే తరహా సంస్కృతి కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన కొడంగల్‌పై, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌పై, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరపై మాత్రమే ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. కొడంగల్ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు తీసుకెళ్తున్న ప్రభుత్వం.. ఫ్లోరైడ్ బారినపడి ఏళ్ల తరబడి అల్లాడుతున్న మునుగోడు ప్రజల కోసం చెరువులు, కుంటలను బాగుచేసేందుకు రూ.500 కోట్లు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.
డిండి ఎత్తిపోతల పథకం పనులు మూడేళ్లుగా పడకేయడంతో నల్గొండ ప్రజల ప్రయోజనాలను బలిపెడుతున్నారని రాజ్‌గోపాల్ పేర్కొన్నారు. చౌటుప్పల్ 100 పడకల ఆసుపత్రి హామీ ఇప్పటికీ అటకెక్కి ఉందని మండిపడ్డారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో వినతిపత్రాలు సమర్పిస్తే బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. అదే ప్రజల ముందు ప్రశ్నిస్తే క్రమశిక్షణ చర్యల పేరిట నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌కు కేటాయించే నిధులపై నిలదీస్తే 'పండబెట్టి తొక్కుతా' అంటూ మాట్లాడటం ఒక ముఖ్యమంత్రికి తగదని హితవు పలికారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తేల్చిచెప్పారు.