- ఆదిభట్ల టీసీఎస్ ఎదుట అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల భారీ నిరసన
- అయ్యప్ప దీక్షలో ఉన్న టెక్కీని లోపలికి అనుమతించకపోవడంతో మొదలైన వివాదం
- రెండేళ్లుగా సంస్థలో పనిచేస్తున్న మనీష్ అనే ఉద్యోగిని అడ్డుకున్న సెక్యూరిటీ
- డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించలేదంటూ ప్రవేశాన్ని నిరాకరించిన యాజమాన్యం
- రెండు నెలల ముందే మేనేజ్మెంట్కు సమాచారం ఇచ్చానని తెలిపిన ఉద్యోగి
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప దీక్ష ధరించిన ఓ టెక్కీని కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో ఆందోళన చెలరేగింది. కంపెనీ యాజమాన్య వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు క్యాంపస్ గేటు ఎదుట బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. దీక్షలో ఉన్న ఉద్యోగిని విధులకు అనుమతించాలని గట్టిగా డిమాండ్ చేశారు.
గత రెండేళ్లుగా టీసీఎస్‌లో పనిచేస్తున్న మనీష్ అనే ఉద్యోగి గురువారం నల్లటి దీక్షా వస్త్రాలతో ఆఫీసుకు వచ్చారు. అయితే కంపెనీ డ్రెస్ కోడ్ నిబంధనల పేరుతో సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను గేటు వద్దే అడ్డుకున్నారు. దీనిపై మనీష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నేను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న విషయాన్ని రెండు నెలల క్రితమే కంపెనీ మేనేజ్మెంట్కు స్పష్టంగా తెలిపాను. తీరా ఈరోజు ఆఫీసుకు వస్తే డ్రెస్ కోడ్ పాటించలేదంటూ నన్ను లోపలికి రానివ్వలేదు. డ్రెస్ కోడ్ పాటించని ఇతర ఉద్యోగులను మాత్రం విధులకు అనుమతిస్తున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకే నన్ను ఎందుకు టార్గెట్ చేసి అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు" అని ఆయన వాపోయారు.
ఈ విషయం బయటకు రావడంతో అయ్యప్ప భక్తులు సంస్థ ముట్టడికి దిగారు. రంగంలోకి దిగిన ఆదిభట్ల పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టెక్కీ చేసిన ఆరోపణల నేపథ్యంలోనే నిరసన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, వాస్తవాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.