- మోటార్ వెహికల్ అగ్రిగేటర్ 2025 మార్గదర్శకాలు అమలు చేయాలని సూచన
- దీంతో కోట్లాది ఉద్యోగాలు వస్తాయని కేంద్రం అంచనా
- ట్రాఫిక్, కాలుష్యం తగ్గడంతో పాటు చౌక ప్రయాణం సాధ్యం
- తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం
అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వ్యక్తిగత (నాన్-ట్రాన్స్పోర్ట్) మోటార్‌సైకిళ్లను కూడా ప్యాసింజర్ ట్యాక్సీలుగా నడిపేందుకు అనుమతించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025"ను అమలు చేయాలని ఆయన సూచించారు.
ఢిల్లీలో బుధవారం నిర్వహించిన 'రైడ్' కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. ఈ అంశంపై ఇప్పటికే అన్ని రాష్ట్రాల రవాణా కమిషనర్లతో చర్చించామని, తమ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం తాను ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు కూడా రాశానని వెల్లడించారు. కేంద్రం జారీచేసిన ఈ మార్గదర్శకాలను ప్రస్తుతం రాజస్థాన్ మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేస్తోందని, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పాక్షికంగా అమలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వల్ల భారీస్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. "పేదరికం, నిరుద్యోగ సమస్యలు అన్నిచోట్లా ఉన్నాయి. ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉపాధి అవకాశాలను మనం ఎందుకు కల్పించకూడదు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ సేవలను దేశవ్యాప్తంగా అనుమతిస్తే, డెలివరీ సర్వీసులతో కలిపి దాదాపు 15 నుంచి 20 కోట్ల మందికి జీవనోపాధి లభిస్తుందని అంచనాలు ఉన్నట్లు ఆయన వివరించారు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను షేర్డ్ ప్రయాణాలకు అనుమతించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గడమే కాకుండా, సామాన్యులకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. ప్రస్తుతం రాపిడో, ఉబర్ వంటి బైక్-ట్యాక్సీ ఆపరేటర్లు పలు రాష్ట్రాల్లో నియంత్రణ పరమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను అమలు చేస్తే, వాటి కార్యకలాపాలకు చట్టపరమైన స్పష్టత లభిస్తుంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది.