- హైదరాబాద్లో యువతులపై దాడి ఘటనపై కేఏ పాల్ ఆగ్రహం
- మూడు నెలల తర్వాత రేవంత్ సీఎంగా ఉండరంటూ వ్యాఖ్యలు
- బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పొత్తుకు సిద్ధమని వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో క్రైస్తవులు, దళితులు, చర్చిలపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఇద్దరు యువతులపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ ఆయన పోలీసుల పనితీరును ప్రశ్నించారు. ఈ ఘటన జరిగి 2 నెలలు గడుస్తున్నా పోలీసులు నిందితులపై సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన నిలదీశారు. యువతులపై దాడి చేసిన వారు రెండు రోజుల్లో బెయిల్ పై బయటకు వచ్చారని ఆవేదన వ్యాక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందని ఆరోపిస్తూ, ఎవరినీ వదిలిపెట్టేది లేదని, తాట తీస్తానంటూ హెచ్చరించారు. మరోసారి దళితులు, యువతులపై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై కేఏ పాల్ పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మరో 3 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగబోరని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణలో భాగంగా తాము పొత్తులకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీ, బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.