- ఏపీఎండీసీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలని లక్ష్యం
- రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
- ఏపీఎండీసీ పరిధిలో రూ.7.8 లక్షల కోట్ల విలువైన ఖనిజాలు
- ఏఐ, మెషిన్ లెర్నింగ్ ద్వారా కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు
- ఒడిశా, ఝూర్ఖండ్లో బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొననున్న ఏపీఎండీసీ
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను (ఏపీఎండీసీ) స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ను లక్ష్యంగా నిర్దేశించి, ఐపీఓ కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీఎండీసీని దేశంలోనే అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
నేడు మైనింగ్ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ఖనిజ వనరులను కేవలం ఆదాయార్జనగా కాకుండా భవిష్యత్ ఆస్తిగా చూడాలని సూచించారు. సమీక్షలో భాగంగా రాష్ట్రంలో లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల అన్వేషణ, నిర్వహణ కోసం ప్రత్యేకంగా 'ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (APREDC) ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. విదేశాల్లో సైతం మైనింగ్ ఆస్తుల కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఏపీఎండీసీ పరిధిలోని ఖనిజ వనరుల విలువ సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా, సంస్థ ఈక్విటీ విలువ రూ.86,290 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు, రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు ఒడిశా, ఝార్ఖండ్‌లలోని మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటోందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ బ్లాకుల్లో 1,774 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో 582 ఖనిజ సంభావ్య ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న 6,500 క్వారీ లీజు దరఖాస్తులు, 223 రెన్యువల్స్‌ను పరిష్కరించేందుకు గడువు పొడిగించాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.