- పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి
- దాడిలో ధ్వంసమైన ఎంపీ కాన్వాయ్‌లోని ఒక వాహనం
- పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయన్న అవినాశ్ రెడ్డి
కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలం అంకలమ్మ గూడూరు సమీపంలో ఈ ఉదయం వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రత్యర్థులు ఒక్కసారిగా రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో కాన్వాయ్‌పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఎంపీ కాన్వాయ్‌లోని ఒక వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత బీటెక్ రవినే తమపై ఈ దాడులు చేయించారని ఆయన ఆరోపించారు.
“కేవలం ఐదు వాహనాలతోనే వెళ్లా. సీఐ, ఎస్‌ఐకు సమాచారం ఇచ్చా. బీటెక్ రవి ఆధ్వర్యంలోనే దాడులు చేశారు. పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి” అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
“నామినేషన్ల కోసం వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారు. మమ్మల్ని అడ్డుకుని దాడులు చేశారు. దాడులు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా? లేదా?” అని ఆయన నిలదీశారు.