- ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య శతాధిక వసంతంలోకి ప్రవేశం
- ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పని చేసిన రామయ్య
ప్రముఖ విద్యావేత్త, 'ఐఐటీ రామయ్య'గా తెలుగు ప్రజలకు సుపరిచితులైన చుక్కా రామయ్య శతాధిక వసంతంలోకి (101) అడుగుపెట్టారు. నవంబర్ 20న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హైదరాబాద్లోని రామయ్య నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామయ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ కుటుంబ సభ్యులతోనూ మంత్రి కొద్దిసేపు మాట్లాడారు.
తెలుగు విద్యార్థులకు ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిపెట్టడంలో చుక్కా రామయ్య చేసిన కృషి అపారం. 1925 నవంబర్ 20న నాటి వరంగల్ (ప్రస్తుత జనగామ) జిల్లా గూడూరులో జన్మించిన ఆయన, విద్యార్థి దశలోనే నిజాం నిరంకుశ పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. భూస్వామ్య విధానాలు, అంటరానితనానికి వ్యతిరేకంగానూ ఉద్యమించారు.
ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి 1983లో పదవీ విరమణ చేసిన తర్వాత, 1985లో హైదరాబాద్లో 'రామయ్య ఐఐటీ స్టడీ సర్కిల్' ఏర్పాటు చేశారు. ఆయన వద్ద శిక్షణ పొందిన ఎంతోమంది గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2007 నుంచి 2013 వరకు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పారు. విద్యారంగంపై ఆయన 16కు పైగా పుస్తకాలు రాశారు. వందేళ్లు దాటినప్పటికీ నిరాడంబరంగా జీవిస్తున్న రామయ్య సమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.