- విశాఖ యాంకర్ ప్రాజెక్టుకు ‘బే-టెక్ సిటీ’గా పేరు ఖరారు
- రాష్ట్రంలో విశాఖ, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధిపై సీఎం సమీక్ష
- తిరుపతిని గ్లోబల్ సెమీకండక్టర్ల డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలని ఆదేశం
- అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ పాలసీ తీసుకురావాలని సూచన
- అరకు, లంబసింగి, సూర్యలంక ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌లో ఏర్పాటు చేస్తున్న యాంకర్ ప్రాజెక్టుకు ‘విశాఖ బే-టెక్ సిటీ’గా సీఎం చంద్రబాబు నాయుడు పేరు ఖరారు చేశారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ తరహాలోనే విశాఖకు అనుబంధంగా ఈ కొత్త నగరాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తన క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్రానికి బ్లూప్రింట్ వంటివని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ‘సిటీ ఎకనమిక్ రీజియన్ స్కీం’ కింద ప్రతిపాదించిన రూ. 9,180 కోట్ల విలువైన 60 ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.
పారిశ్రామిక అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. విశాఖకు ఇరువైపులా ఉన్న విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో ముందుగానే భూమిని గుర్తించాలన్నారు. భూ లభ్యత తక్కువగా ఉన్న ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైతే ప్రత్యేక పాలసీ తీసుకురావాలని స్పష్టం చేశారు.
మూడు ప్రాంతాలు.. మూడు లక్ష్యాలు
తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని టెక్నాలజీ, ఇండస్ట్రీ, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్దేశించారు. తిరుపతిని ‘గ్లోబల్ సెమీకండక్టర్ల డిజైన్ క్యాపిటల్’గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అమరావతి రీజియన్‌లో ఆక్వా, పామాయిల్ వంటి రంగాలు ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయని, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు కనెక్టివిటీ మెరుగుపరిస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పర్యాటక రంగంపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించాలన్నారు. సూర్యలంక, ఓడరేవు, గండికోట వంటి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.