- దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల
- వ్యోమగామి కావాలనుకున్న అమ్మాయికి అండగా నిలిచే పాత్రలో దుల్కర్
- మనసును హత్తుకుంటున్న డైలాగ్స్, జీవీ ప్రకాశ్ సంగీతం
- ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా నిర్మాణం
- ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు మూవీ
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో దుల్కర్ సల్మాన్, మరో ఆసక్తికర చిత్రంతో ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో, పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. వ్యోమగామి కావాలని కలలు కనే ఒక సాధారణ పల్లెటూరి యువతికి అండగా నిలిచే యువకుడి కథతో ఈ సినిమా రాబోతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.
ట్రైలర్ గమనిస్తే.. మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి) అనే యువతికి వ్యోమగామిగా ఎదగాలనే పెద్ద కల ఉంటుంది. కానీ, ఆమె ఆశయానికి చుట్టూ ఉన్నవారి ఎగతాళి, ఆర్థిక పరిస్థితులు అడ్డుపడతాయి. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి వచ్చిన కృష్ణ (దుల్కర్ సల్మాన్), ఆమె లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా సాయపడ్డాడనేది కథాంశం. "పది మంది నవ్వితే ఏంటి.. ఒక్కరు నమ్మితే చాలదా?" అంటూ కథానాయిక చెప్పే డైలాగ్ సినిమాలోని భావోద్వేగాన్ని తెలియజేస్తోంది.
దుల్కర్ సల్మాన్ తన సహజ నటనతో కృష్ణ పాత్రలో ఒదిగిపోగా, కొత్తమ్మాయి అయినా సాత్విక తన నటనతో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళీ శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు కలిసి నిర్మించడంతో నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపిస్తున్నాయి.