- బాలి సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్న బోర్డు
- 2024 డిసెంబర్ 1న తొలిసారి బాధ్యతలు
- 35 ఏళ్ల వయసులో ఈ పదవిని అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
- ఐసీసీ బోర్డు సభ్యులకు జై షా కృతజ్ఞతలు
- ఒలింపిక్స్‌లో క్రికెట్, మహిళల క్రికెట్ అభివృద్ధిపై ప్రాధాన్యమని అని వెల్లడి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఈ పదవికి ఆయన పేరును ఐసీసీ బోర్డు ఖరారు చేసింది. బాలి వేదికగా జరిగిన బోర్డు సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో జై షా నాయకత్వం మరోసారి కొనసాగనుంది.
2024 ఆగస్టులో తొలిసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా.. అదే ఏడాది డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయసు 35 ఏళ్లు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటి ఛైర్మన్ గ్రెగ్ బార్క్‌లే మూడోసారి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో జై షా ఒక్కరే బరిలో నిలిచారు. ఐసీసీకి నాయకత్వం వహించిన ఐదో భారతీయుడిగా గుర్తింపు పొందారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్.శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఈ బాధ్యతలు నిర్వహించారు.
2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి చోటు దక్కించుకోవడం ఐసీసీ ముందున్న ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో జై షా రెండోసారి ఎన్నిక కావడం నాయకత్వంలో కొనసాగింపునకు దోహదపడుతుందని ఐసీసీ భావిస్తోంది. క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరించడం, మహిళల క్రికెట్‌ను బలోపేతం చేయడం, అసోసియేట్ సభ్య దేశాలకు అవకాశాలు పెంచడం, ఆటకు దీర్ఘకాలిక ఆదాయ వనరులు కల్పించడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు.
తనపై మరోసారి విశ్వాసం ఉంచిన ఐసీసీ బోర్డు సభ్యులకు జై షా కృతజ్ఞతలు తెలిపారు. సభ్య దేశాలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కొత్త ప్రేక్షకులను ఆకర్షించేందుకు, యువతలో ఆటపై ఆసక్తి పెంచేందుకు గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డారు. అభిమానులు, ఆటగాళ్లు, వాణిజ్య భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రికెట్‌కు స్థిరమైన భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత ఉందన్నారు.
జై షా కొనసాగింపును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ స్వాగతించారు. ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రాధాన్యాన్ని కాపాడుతూ అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్ రోస్ రివాజ్ మహిళల క్రికెట్ అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచించారు. జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్, ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ.. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ ద్వారా ఆఫ్రికాలో క్రికెట్‌కు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ సమగ్రతను కాపాడటం, వివిధ ఫార్మాట్లకు ఆదరణ నిలబెట్టడం, అసోసియేట్ దేశాలకు ఉన్నతస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలు పెంచడం కూడా ఐసీసీ ముందున్న ప్రాధాన్యాలుగా ఉన్నాయి.