- ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. 10 చోట్ల ఏకకాలంలో సోదాలు
- లంచం కేసు తర్వాత మరో చిక్కు.. అధికారిణి ఆస్తులపై ఏసీబీ నజర్
- గుండు వాణి ఇళ్లు, బంధువుల నివాసాల్లో ఏసీబీ తనిఖీలు
- రూ.75 వేల లంచం కేసు.. ఇప్పుడు ఆస్తుల లెక్కలు తీస్తున్న ఏసీబీ
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో మోయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం హైదరాబాద్, మహబూబ్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఆమెకు సంబంధించిన నివాసం, బంధువుల ఇళ్లు, ఇతర ప్రాంతాలు కలిపి మొత్తం 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.
రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, ఆదాయ మార్గాలు, ఆస్తుల సమీకరణ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆదాయ వనరులకు మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వాణిపై ఆరోపణలు ఉన్నాయి.
సెప్టెంబర్ 30న లంచం కేసులో ఆమె ఏసీబీకి పట్టుబడిన ఘటన ఈ దర్యాప్తునకు కారణమైంది. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె తరఫున ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా మోయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యాలమోని సుదర్శన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు తర్వాత వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి తాజా సోదాలు చేపట్టారు.