- జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో ఎన్కౌంటర్
- లష్కరే తోయిబా ఉగ్రవాది భట్ హతం
- మరో ఉగ్రవాది భద్రతా బలగాల ఉచ్చులో చిక్కుకున్నట్టు సమాచారం
- ఈ నెల 11న మీర్‌బజార్ సమీపంలోని సీఆర్‌పీఎఫ్ పోస్టుపై కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయం
- ఆ తర్వాత కిష్త్వార్‌లో ఇద్దరు ఎస్‌పీఓలు హత్య
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాది భద్రతా బలగాల ఉచ్చులో చిక్కుకున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. హతమైన ఉగ్రవాది భట్ స్థానికుడని, పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ నెల 11న కుల్గాంలోని మీర్‌బజార్ సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ పోస్టుపై ఇద్దరు భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. అనంతరం ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అప్పటి నుంచి వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.
హతమైన భట్ ఈ ఏడాది జరిగిన పలు ఉగ్రదాడుల్లోనూ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. జులై 22న అనంతనాగ్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో పోలీసు కానిస్టేబుల్ హత్య, జులై 31న కుల్గాంలో వలస కార్మికుల హత్య ఘటనల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్థానికంగా ఆశ్రయాలు కల్పించే నెట్‌వర్క్ సాయంతో దక్షిణ కశ్మీర్‌లో సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
కుల్గాం దాడి జరిగిన 24 గంటల్లోపే కిష్త్వార్‌లో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్‌పీఓలు) బాబీ చంద్, యశ్‌పాల్ కుమార్ హత్యకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అంతటా అప్రమత్తత పెంచినట్లు సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డీజీ సందీప్ ఖిర్వార్ తెలిపారు.
కశ్మీర్ లోయలో సజీవంగా ఉన్న ఏకైక ఉగ్రవాది అబ్దుల్ లతీఫే భట్ మాత్రమేనని భద్రతా బలగాలను ఉటంకిస్తూ ఇటీవల పలు వార్తా కథనాలు వెలువడ్డ విషయం తెలిసిందే. తాజాగా మరణించింది అతడేనని స్పష్టమవుతోంది. అతడిని పట్టుకున్నా లేదా సమాచారం అందించినా రూ.15 లక్షల రివార్డు కూడా ఇస్తామని ఇటీవల కశ్మీర్‌లో పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. తాజా ఎన్‌కౌంటర్‌తో లోయలో ఉన్న ఏకైక స్థానిక ఉగ్రవాది మరణించినట్లయింది. దీన్ని ఇంకా పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.