- వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ పోస్ట్
- ఆయన నివాసం జల్సా బయట కాల్పులకు కుట్ర
- ఇద్దరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు అరెస్ట్
- 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై అమితాబ్ చేసిన వ్యాఖ్యలే కారణమై ఉండొచ్చని అనుమానం
- గత నెలలోనే అమితాబ్ నివాసం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 3 సార్లు బాంబు బెదిరింపు
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన ఓ చిన్న సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరుస బాంబు బెదిరింపులు, తన నివాసం బయట కాల్పులకు కుట్ర జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. నవంబర్ 15-16 మధ్య రాత్రి ఆయన ఎక్స్ వేదికగా ‘బచ్ గయే’ (బతికిపోయాం) అని రాశారు. అయితే ఈ వ్యాఖ్య వెనుక కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు, అమితాబ్ నివాసం ‘జల్సా’ బయట కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌కు చెందిన వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ, దీపక్ సింగ్ అలియాస్ దీప్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ వ్యాపారిపై కాల్పులు జరిపి డబ్బులు వసూలు చేయడంతో పాటు, అమితాబ్‌ను లక్ష్యంగా చేసుకోవాలని నిందితులు పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై అమితాబ్ చేసిన వ్యాఖ్యలే ఆయనను లక్ష్యంగా చేసుకోవడానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. గత నెలలోనే అమితాబ్ నివాసం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మూడుసార్లు బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు వచ్చాయి. దీంతో జల్సా వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిందితుల నుంచి ఆయుధాల సరఫరా, గ్యాంగ్ నెట్‌వర్క్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.