- దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' ప్రీ రిలీజ్ వేడుక
- ముఖ్య అతిథిగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
- సినిమాపై అల్లు అరవింద్ బలమైన నమ్మకం
- హీరోయిన్ సాత్విక స్టార్ అవుతుందని ధీమా
- నవంబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల
"గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో బ్లాక్బస్టర్సు నిర్మించాను. అయితే, 'ఆకాశంలో ఒక తార' సినిమా చేస్తున్నప్పుడు కలిగిన ఉత్సాహం మాత్రం చాలా ప్రత్యేకమైనది’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. నవంబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప కథను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
హీరో దుల్కర్ సల్మాన్ను ప్రశంసిస్తూ.. అతడు అత్యంత సంస్కారవంతుడని, వెండితెరపై పోషించే పాత్రల కంటే నిజ జీవితంలో ఎంతో సౌమ్యుడని కొనియాడారు. ఇదే చిత్రంతో కథానాయికగా పరిచయమవుతున్న సాత్విక అద్భుతంగా నటించిందని, ఆమె ప్రతిభకు ముగ్ధుడనై అప్పుడే మరో రెండు చిత్రాలకు ఒప్పందాలు కూడా చేసుకున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆమె గొప్ప తారగా ఎదుగుతుందనే నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు పవన్ సాధినేని తొలి చిత్రం నుంచే తనతో కలిసి పనిచేయాలని అనుకున్నానని, ఈ సినిమాతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉందని అల్లు అరవింద్ తెలిపారు. తన ఆప్తమిత్రుడు అశ్వినీదత్ కుమార్తెతో కలిసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని మిగుల్చుతుందని ఆయన పేర్కొన్నాడు.
పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.