- హైకోర్టు ఆదేశాల పేరిట 129 బెట్టింగ్ సైట్లను బ్లాక్ చేసిన కేంద్ర టెలికాం శాఖ
- పరిశీలనలో పూర్తిగా నకిలీవని తేలిన న్యాయస్థానాల ఉత్తర్వులు
- కోర్టు సీల్స్, జడ్జిల సంతకాలు ఫోర్జరీ చేసి ఈమెయిల్స్ పంపిన కేటుగాళ్లు
- అలహాబాద్ హైకోర్టు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు
- కనీస ధ్రువీకరణ లేకుండా ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు
దేశంలో డిజిటల్ కంటెంట్ బ్లాకింగ్ వ్యవస్థలో ఉన్న తీవ్రమైన భద్రతా లోపాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఉన్నత న్యాయస్థానాల పేరిట వచ్చిన నకిలీ ఆదేశాలను గుడ్డిగా నమ్మిన కేంద్ర టెలికాం విభాగం (DoT), ఏకంగా 129 బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేయడం కలకలం రేపింది. రాజస్థాన్, అలహాబాద్ హైకోర్టులు ఈ సైట్లను నిషేధించాలని ఆదేశించినట్లు వచ్చిన పత్రాల ఆధారంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ఐఎస్పీ) ఆదేశాలు జారీ కాగా, తీరా పరిశీలించాక ఆ ఉత్తర్వులన్నీ పూర్తిగా నకిలీవని తేలింది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ వ్యవహారంలో మోసగాళ్లు నకిలీ పత్రాలను సృష్టించారు. న్యాయస్థానాల అధికారిక లోగోలు, బ్లూ సీల్స్‌ను ఫోర్జరీ చేయడమే కాకుండా, జస్టిస్ గరిమా ప్రసాద్ వంటి న్యాయమూర్తుల సంతకాలను కూడా అక్రమంగా రూపొందించారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆర్డర్ కాపీలపై క్యూఆర్ (QR) కోడ్లను కూడా ముద్రించారు. అయితే, ఆ కోడ్లను స్కాన్ చేస్తే ఇతర సంబంధం లేని పాత కేసుల వివరాలు కనిపించడంతో అసలు బండారం బయటపడింది.
న్యాయ నిపుణుల పేర్లతో ఈమెయిల్ ఐడీలను సృష్టించిన కేటుగాళ్లు, ఈ నకిలీ న్యాయస్థాన ఉత్తర్వులను నేరుగా కేంద్ర ప్రభుత్వ విభాగానికి పంపించారు. అయితే, ఆ పత్రాల ప్రామాణికతను కనీసం తనిఖీ చేయకుండానే టెలికాం విభాగం ఆటోమేటెడ్ పద్ధతిలో చర్యలు చేపట్టింది. వెంటనే ఆయా వెబ్సైట్లను నిలిపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు వెళ్లడంతో ఈ మోసం అమలులోకి వచ్చింది.
ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ మరియు రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. ఫోర్జరీ, మోసం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ నకిలీ పత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రభుత్వ వ్యవస్థలో వీటిని ఎలా ప్రాసెస్ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ లాగ్స్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CMS) వివరాలు, డేటాను పోలీసులు సేకరిస్తున్నారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌పై నిషేధం విధించేటప్పుడు లేదా డిజిటల్ కంటెంట్‌ను తొలగించేటప్పుడు పాటించాల్సిన ప్రాథమిక ధ్రువీకరణ నిబంధనలను విస్మరించడంపై రాజకీయ నాయకులు, సైబర్ భద్రతా నిపుణులు, పౌర సమాజ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కనీస విచారణ లేకుండా ఇలాంటి నిషేధాలు అమలు చేయడం వ్యవస్థాగత లోపాలను వేలెత్తి చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.