- అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈపై 160 పరుగులు చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్
- ఈ ఇన్నింగ్స్‌తో సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు
- చిన్నప్పుడు కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ పాత వీడియో వైరల్
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్, అండర్-19 ఆసియా కప్‌లో అద్భుత శతకంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. యూఏఈపై అతను 160 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడటంతో సుమారు పదేళ్ల క్రితం చిన్నారిగా విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒమన్‌లోని అల్ అమీరత్ వేదికగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొదట నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత చెలరేగి ఆడాడు. మొత్తం 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగులు సాధించాడు.
మ్యాచ్ అనంతరం ఆర్యవీర్ మాట్లాడుతూ.. తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌కు భారీ సెంచరీ చేస్తానని మాటిచ్చినట్లు తెలిపాడు. "మా నాన్నకు ఎప్పుడూ భారీ శతకాలంటేనే ఇష్టం. సెంచరీ దాటిన స్కోర్లనే ఆయన గౌరవిస్తారు. అందుకే ఆయనకు ఓ పెద్ద వంద కొడతానని చెప్పాను. ఈ రోజు ఆ మాట నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని వివరించాడు.
ఈ సెంచరీ నేపథ్యంలో 2017లో 'స్టార్ స్పోర్ట్స్' ప్రసారం చేసిన ఓ పాత వీడియో క్లిప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అప్పుడు తొమ్మిదేళ్ల బాలుడిగా ఉన్న ఆర్యవీర్.. అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. "మీరు మా నాన్నను మొదటిసారి ఎప్పుడు కలిశారు?" అని ఆర్యవీర్ అమాయకంగా అడగగా, ఢిల్లీలో అండర్-17 క్రికెట్ ఆడుతున్నప్పుడు కలిశానని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఆర్యవీర్‌కు ఒక కీలక సలహా ఇచ్చాడు. "ఎప్పుడూ ఒకటే చెబుతాను. నేను ఎదైనా చేయగలనని నిన్ను నీవ్వు నమ్ము. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించు" అని అన్నాడు.
ప్రస్తుతం ఆర్యవీర్ ఆడుతున్న తీరుకు అప్పుడు కోహ్లీ ఇచ్చిన సలహా బాగానే పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. ఒకప్పుడు కోహ్లీని ఆరాధనగా చూసిన చిన్నారి, ఇప్పుడు జూనియర్ స్థాయిలో తానే సత్తా చాటుతుండటం క్రికెట్ అభిమానులకు ఆసక్తి కలిగిస్తోంది. ఈ టోర్నీ సెమీఫైనల్‌లో భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.