- జీటీఏ-6 ఆడుతూ పరిశోధన చేసే ఉద్యోగాన్ని ప్రకటించిన అమెరికా సంస్థ కల్షీ
- ఏడాదికి రూ.88 లక్షల నుంచి రూ.1.06 కోట్ల వరకు వేతనం
- పదేళ్ల గేమింగ్ అనుభవం, ఫైనాన్స్‌పై అవగాహన తప్పనిసరి
- జీతంతో పాటు టీవీ, గేమింగ్ కన్సోల్, ఇతర సదుపాయాలు
- ఈ గేమ్ వల్ల సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని విశ్లేషించడమే పని
వీడియో గేమ్స్ ఆడటం చాలామందికి సరదా. కానీ అదే పనిని ఉద్యోగంగా చేసుకుంటూ ఏడాదికి కోటి రూపాయలకు పైగా సంపాదించే అవకాశం వస్తే? అమెరికాకు చెందిన ప్రిడిక్షన్ మార్కెట్ సంస్థ ‘కల్షీ’ ఇలాంటి అరుదైన ఉద్యోగ ప్రకటన చేసింది. ‘జీటీఏ-6 రీసెర్చర్’ పేరుతో ప్రకటించిన ఈ రిమోట్ కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఏడాదికి 1 లక్ష నుంచి 1.2 లక్షల డాలర్ల వరకు వేతనం ఇవ్వనుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.88 లక్షల నుంచి రూ.1.06 కోట్ల వరకు ఉంటుంది.
ఉద్యోగంలో చేరిన వ్యక్తి జీటీఏ-6 విడుదలైన రోజున అర్ధరాత్రి నుంచే గేమ్ ఆడటం ప్రారంభించాలి. ప్రధాన కథ పూర్తయ్యే వరకు ఆటను కొనసాగించాలి. ఈ మొత్తం గేమ్‌ప్లేను ట్విచ్ లేదా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి. ప్రసారంలో పరిశోధకుడు స్వయంగా కనిపించాలి.
జీటీఏ-6 కథలోని కల్పిత రాష్ట్రం లియోనిడాను ఆర్థిక పరిశోధనకు ఒక ప్రయోగశాలగా చూడాలి. అక్కడి ధరలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వినియోగదారుల ఖర్చులను పరిశీలించాలి. ఈ వివరాలతో ‘స్టేట్ ఆఫ్ ది లియోనిడా ఎకానమీ’ పేరుతో నివేదిక రూపొందించి కల్షీకి అందించాలి. గేమ్ విడుదల ప్రభావం నిజ జీవితంలో ఎలా ఉంటుందో కూడా అధ్యయనం చేయాలి. ఉద్యోగులు కార్యాలయాలకు గైర్హాజరయ్యే పరిస్థితులు, డోర్‌డాష్ వంటి ఫుడ్ డెలివరీ సేవల వినియోగంలో వచ్చే మార్పులను గమనించాలి.
వార్షిక వేతనంతో పాటు 15 వేల డాలర్ల గేమింగ్, స్ట్రీమింగ్ ఖర్చుల భత్యం ఇవ్వనున్నారు. 100 అంగుళాల టీవీ, ప్లేస్టేషన్-5 లేదా ఎక్స్‌బాక్స్ కన్సోల్, రోజువారీ డోర్‌డాష్ క్రెడిట్లు, జిమ్ సభ్యత్వం కూడా అందించనున్నారు.
దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. పదేళ్ల గేమింగ్ అనుభవం తప్పనిసరి. వీడియో గేమ్స్‌పై ఆసక్తితో పాటు ఆర్థిక వ్యవస్థలు, ఫైనాన్స్‌పై అవగాహన కూడా అవసరం. ఎందుకంటే గేమ్‌లోని ఆర్థిక లావాదేవీలతో పాటు దాని విడుదల వల్ల నిజ జీవితంలో వచ్చే మార్పులను కూడా విశ్లేషించాల్సి ఉంటుంది.
రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, వాతావరణం, సాంకేతికత, వినోద రంగాలకు సంబంధించిన పరిణామాలపై అంచనాల ఆధారంగా లావాదేవీలు నిర్వహించే వేదిక కల్షీ. జీటీఏ-6 విడుదల భారీ స్థాయిలో ఉండనుండటంతో ప్రజల ప్రవర్తన, ఖర్చులు, ఉద్యోగుల హాజరుపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయాలని సంస్థ భావిస్తోంది. జీటీఏ-6 నవంబర్ 19న ప్లేస్టేషన్-5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ కన్సోళ్లపై విడుదల కానుంది.