- శంషాబాద్ ముచ్చింతల్ సమీపంలో శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
- అతివేగంగా వచ్చిన పండ్ల లోడు లారీ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన వైనం
- ప్రమాద తీవ్రతకు పూర్తిగా నుజ్జునుజ్జైన కారు వెనుక భాగం
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ దుర్ఘటనలో ఆయనతో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘కాకా’లో ఒక పాటకు సంబంధించిన నైట్ షూటింగ్ ముగించుకుని, శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్దకు చేరుకోగానే... ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన పండ్ల లోడు లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, కారులోని శేఖర్ మాస్టర్‌తో పాటు ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఒక వీడియో సందేశం ద్వారా స్పందిస్తూ... "కాకా సాంగ్ షూటింగ్ ని ముగించుకొని తిరిగి వస్తుంటే తెల్లవారుజామున 6 గంటలకు కారు యాక్సిడెంట్ కి గురైంది. కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో కారులో మేము నలుగురం ఉన్నాం.. అయ్యప్ప దయ వల్లే మాకు ఏమీ జరగలేదు. అందరూ నాకు ఏమైందో అని మెసేజ్ లు చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మాతో పాటు ఉన్నవారు కూడా క్షేమంగా ఉన్నారు. ఈరోజు రాత్రికి కూడా షూటింగ్ ఉంది. దానికి బయల్దేరుతున్నాను" అని తెలిపారు.
ఇటీవలే అయ్యప్ప స్వామి మాల ధరించిన శేఖర్ మాస్టర్.. స్వామివారి ఆశీస్సుల వల్లే ఇంతటి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామని భావోద్వేగంతో వెల్లడించారు. తామంతా క్షేమంగా ఉన్నామని చెప్పడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.