మనిషితో రోబో ఫైట్‌.. టెర్మినేటర్‌ను తలపించిన వీడియో వైరల్‌!

మనిషితో రోబో ఫైట్‌.. టెర్మినేటర్‌ను తలపించిన వీడియో వైరల్‌!

Robot fight with human viral video reminds of Terminator
  • అమెరికాలో మనిషి-రోబో ఫైట్‌
  • రోబోతో పోరాడిన ఫ్రాంకీ లాపెన్నా
  • ఆరు అడుగుల రోబో పంచ్‌లు, కిక్స్‌
  • కిక్స్‌తో వెనక్కి వెళ్లిన లాపెన్నా
  • రోబోతో క్రీడలపై మొదలైన చర్చ
మనిషితో ఆరు అడుగుల రోబో ఫైట్‌ చేస్తే ఎలా ఉంటుంది? హాలీవుడ్‌ సినిమాలో చూసే సీన్‌లా అనిపించినా.. అమెరికాలో నిజంగానే అలాంటి పోరాటం జరిగింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ ఫైట్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌, కంటెంట్‌ క్రియేటర్‌ ఫ్రాంకీ లాపెన్నా ఓ హ్యూమనాయిడ్‌ రోబోతో తలపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాకు చెందిన రోబోటిక్స్‌ కంపెనీ ఆర్‌ఈకే ఈ మ్యాచ్‌ను నిర్వహించింది. మనుషులు రిమోట్‌ కంట్రోల్‌తో హ్యూమనాయిడ్‌ రోబోలను నడిపిస్తూ పోటీ పడే వర్చువల్‌ రియాలిటీ కంబాట్‌ గేమ్‌పై కంపెనీ పనిచేస్తోంది. అందులో భాగంగానే ఈ ఫైట్‌ను నిర్వహించింది.

మ్యాచ్‌కు ముందు రోబో రింగ్‌లో తిరుగుతూ వార్మప్‌ చేసింది. ఫైట్‌ మొదలైన తర్వాత లాపెన్నా దానిపై పలుసార్లు పంచ్‌లు విసిరాడు. రోబో కూడా పంచ్‌లు, బలమైన కిక్స్‌తో స్పందించింది. కొన్ని సందర్భాల్లో రోబో కిక్స్‌ బలంగా తగలడంతో లాపెన్నా రింగ్‌లో వెల్లకిలాపడ్డాడు.

ఈ పోరును ఆర్‌ఈకే తమ తొలి ‘హ్యూమన్‌ వర్సెస్‌ హ్యూమనాయిడ్‌ రోబో ఫైట్‌’గా పేర్కొంది. ‘హ్యూమన్‌ వర్సెస్‌ టెర్మినేటర్‌’ అంటూ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలను విడుదల చేస్తామని తెలిపింది.

వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులు, రోబోలు ప్రొఫెషనల్‌ కంబాట్‌ స్పోర్ట్స్‌లో పోటీ పడతారా? అంటూ చర్చిస్తున్నారు.

హ్యూమనాయిడ్‌ రోబో ప్రవర్తనకు ‘టెర్మినేటర్‌’తో పోలిక రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ ఎలక్ట్రానిక్స్‌ స్టోర్‌లో కస్టమర్‌ రోబోను నెట్టగా.. అది అతడి వైపు కదిలి కిక్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించిన వీడియో కూడా వైరల్‌ అయింది. సిబ్బంది వెంటనే రోబోను ఆపేశారు.
Advertisement
Frankie Lapenna
Humanoid Robot Fight
REK Robotics
Human vs Robot Combat
Terminator Style Robot
San Francisco Robot Match

More Telugu News