- నిమ్మ వ్యాపారం చేస్తున్న ఒడిశాలోని ఓగి గ్రామానికి చెందిన సంతోష్ సాహు
- ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవర్ సాధిస్తూ రైతులకు స్ఫూర్తి
- 200 మందికి పైగా రైతుల నుంచి కాగ్జీ నిమ్మకాయల సేకరణ
- దేశీయ మార్కెట్లతో పాటు అమెరికా, బ్రిటన్‌కు ఎగుమతి
- గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు 150 ఎకరాల్లో నిమ్మ సాగు
చిన్న ఆలోచన.. స్వల్ప పెట్టుబడి.. పట్టుదలతో కూడిన ప్రయత్నం! ఇవి ఉంటే వ్యవసాయంలోనూ అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు ఒడిశాకు చెందిన ఓ రైతు. ఏనుగులు, కోతుల బెడదతో పంటలు దెబ్బతింటున్న సమయంలో మొదలైన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంగా ఎదిగింది. కేవలం రూ.100తో మొదలైన నిమ్మ సాగు.. నేడు ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది. అంతేకాదు.. 200 మందికి పైగా రైతులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ ఓ గ్రామానికే కొత్త గుర్తింపు తెచ్చింది.
ఏనుగులు, కోతుల బెడదతో కొత్త ఆలోచన
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న ఓగి గ్రామానికి చెందిన కార్తీక సాహు సుమారు 15 ఏళ్ల క్రితం ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో వరి, వేరుశనగ వంటి పంటలను ఏనుగులు, కోతులు తరచూ నాశనం చేసేవి. దీంతో రైతులు నష్టాలు చవిచూసేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా నిమ్మ సాగును ఎంచుకున్నారు కార్తీక్ సాహూ. ఉద్యానవన శాఖ నుంచి ఒక్కోటి రూ.2 చొప్పున 50 కాగ్జీ నిమ్మ మొక్కలు కొనుగోలు చేశారు. మొత్తం పెట్టుబడి కేవలం రూ.100 మాత్రమే. ఆ మొక్కలు పెరిగి కాపునకు రావడంతో ఆయన ప్రయోగం విజయవంతమైంది. గ్రామంలోని ఇతర రైతులూ నిమ్మ సాగుపై ఆసక్తి చూపారు.
తండ్రి బాటలోనే.. వ్యాపార విస్తరణ
సుమారు ఏడేళ్ల క్రితం తండ్రి మరణించడంతో సాగు బాధ్యతలను సంతోష్ సాహు తీసుకున్నారు. అప్పటికే గ్రామంలో చాలామంది నిమ్మ సాగు చేస్తున్నా.. పంట అమ్ముకునేందుకు సరైన మార్కెట్లు లేవని గుర్తించారు. స్థానిక మార్కెట్లలోనే తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో రైతుల నుంచి నిమ్మకాయలు కొనుగోలు చేసి పెద్ద మార్కెట్లకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ విధానం రైతులకు కొత్త కొనుగోలుదారులను పరిచయం చేయడంతో పాటు ఎక్కువ మొత్తంలో పంట విక్రయించుకునే అవకాశం కల్పించింది.
200 మందికి పైగా రైతులతో అనుబంధం
సంతోష్ తనకున్న ఎకరం పొలంలో సుమారు 120 నిమ్మ చెట్లను పెంచుతున్నారు. వీటితోపాటు గ్రామంలోని 200 మందికి పైగా రైతుల నుంచి నిమ్మకాయలు సేకరిస్తున్నారు. అంగుల్, భువనేశ్వర్, కటక్, ధెంకనాల్తో పాటు జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.
రైతుల నుంచి 100 నిమ్మకాయలను రూ.220-280కు కొనుగోలు చేసి, రూ.300-320కు విక్రయిస్తున్నారు. వ్యాపార టర్నోవర్‌లో దాదాపు 60 శాతం రైతులకు చెల్లింపుల రూపంలోనే వెళ్తోంది. నిమ్మ మొక్కలను ఒక్కొక్కటి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. రెండు ప్రధాన కోత సీజన్లలో కలిపి ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవర్ సాధిస్తున్నట్లు సంతోష్ తెలిపారు.
ఒక్కో చెట్టుకు వెయ్యికి పైగా కాయలు
గ్రామంలో పండించే కాగ్జీ నిమ్మకాయలకు పలుచని తొక్క, ఎక్కువ రసం ఉండటం ప్రత్యేకత. మొక్క నాటిన మూడు నుంచి నాలుగేళ్లకు కాపునకు వస్తుంది. చెట్టు వయసు పెరిగే కొద్దీ దిగుబడీ పెరుగుతుంది. ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల వయసున్న, 12 అడుగుల ఎత్తు పెరిగిన చెట్టు కోత సీజన్లో వారానికి వెయ్యికి పైగా కాయలు ఇస్తుందని సంతోష్ వివరించారు. పది అడుగుల ఎత్తున్న చెట్టు నుంచి వారానికి 600కు పైగా కాయలు వస్తాయని చెప్పారు.
ఒక్క గ్రామంలో 150 ఎకరాలకు పైగా సాగు
సంతోష్ ప్రయత్నం గ్రామంలోని ఇతర రైతులకూ స్ఫూర్తినిచ్చింది. ఓగి గ్రామంలో దాదాపు 700 కుటుంబాలు ఉండగా.. వాటిలో 500 కుటుంబాలు ఇప్పుడు నిమ్మ సాగు చేస్తున్నాయి. గ్రామంలో, పరిసర ప్రాంతాల్లో కలిపి 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. రైతులు సగటున ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. మరో రైతు తన 1.5 ఎకరాల్లో సుమారు 200 నిమ్మ చెట్లు పెంచుతూ రెండు కోత సీజన్లలో దాదాపు రూ.80 వేల ఆదాయం పొందారు.
గ్రామానికి చెందిన పంచానన్ సాహు తన తోటలో పండిన 3 వేల నుంచి 4 వేల నిమ్మకాయలను సంతోష్‌కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వాటిని సంతోష్ భువనేశ్వర్, కటక్ మార్కెట్లకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఈ ఆదాయమే తమ కుటుంబాల పోషణకు తోడ్పడుతోందని వివరించారు.
రూ.100తో మొదలైన ఓ చిన్న వ్యవసాయ ప్రయోగం.. నేడు రూ.కోటికి పైగా వ్యాపారంగా ఎదిగింది. అంతేకాదు.. వందలాది కుటుంబాలకు ఆదాయ మార్గంగా మారింది. సరైన ఆలోచన, మార్కెట్‌పై అవగాహన ఉంటే వ్యవసాయంలోనూ అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని సంతోష్ ప్రయాణం చాటిచెబుతోంది.