- తనిఖీల్లో అపరిశుభ్రత, బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు గుర్తింపు
- వాడిన నూనెను శుద్ధి చేసేందుకు ప్రమాదకర రసాయనాల వినియోగం
- స్విగ్గీ, జొమాటోల నుంచి ఈ ఔట్లెట్లను తొలగించాలని ఆదేశాలు
- నగరవ్యాప్తంగా 26 ఔట్లెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై 'తెలంగాణ స్టేట్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్' (TG SAFE) అధికారులు కొరడా ఝళిపించారు. అపరిశుభ్రత, నాణ్యతా లోపాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తేల్చిన అధికారులు.. నగరంలోని ఏడు కేఎఫ్‌సీ, రెండు డొమినోస్ పిజ్జా ఔట్లెట్ల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 13 బృందాలు నగరవ్యాప్తంగా ఈ రెండు సంస్థలకు చెందిన 26 ఔట్లెట్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
ఈ తనిఖీల్లో అధికారులు షాకింగ్ విషయాలను గుర్తించారు. వంటగదులు, స్టోరేజ్ ఏరియాల్లో బొద్దింకలు, ఈగలు విపరీతంగా ఉండటం, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, గోడలపై ఫంగస్, జిడ్డు పట్టిన వంటసామగ్రి, పరికరాలు, దుర్వాసన వంటి పలు తీవ్రమైన లోపాలను కనుగొన్నారు. ముఖ్యంగా వాడిన వంట నూనెను మళ్లీ వినియోగించేందుకు దాన్ని శుద్ధి చేయడానికి 'సింథటిక్ మెగ్నీషియం సిలికేట్' అనే రసాయనాన్ని అక్రమంగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా సుమారు 52 కిలోల ఈ రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ జరిగిందనే అనుమానంతో 20 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
లైసెన్సులు రద్దయిన వాటిలో మదీనగూడ-మియాపూర్, సింధి కాలనీ, చార్మినార్, మూసారాంబాగ్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక, మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లోని కేఎఫ్‌సీ శాఖలు ఉన్నాయి. అలాగే, కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్, మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లోని డొమినోస్ ఔట్లెట్ల లైసెన్సులను కూడా సస్పెండ్ చేశారు. ఈ ఔట్లెట్లను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. లైసెన్సులు పునరుద్ధరించే వరకు ఈ తొమ్మిది ఔట్లెట్ల వివరాలను స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని కూడా అధికారులు కోరనున్నారు.
ఇవి కాకుండా, మరో ఎనిమిది ఔట్లెట్లకు (నాలుగు కేఎఫ్‌సీ, నాలుగు డొమినోస్) ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో ఐదు ఔట్లెట్లకు షోకాజ్ నోటీసులు పంపి, జరిమానాలతో సహా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.