విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్ లో ఉంచడం ఎందుకు? అసలు కారణం ఇదే!
- విమానంలో ఫోన్ సిగ్నల్స్ వల్ల రేడియో తరంగాల్లో అంతరాయానికి అవకాశం
- పైలట్ హెడ్‌సెట్‌లో అవాంఛిత బజ్ శబ్దాలు వచ్చే ప్రమాదం
- ఫోన్ సిగ్నల్స్ వల్ల నేలపై ఉన్న నెట్‌వర్క్‌పైనా అధిక భారం
- 5జీ సీ-బ్యాండ్ ఫ్రీక్రెన్సీతో ఆల్టీమీటర్ పనితీరుపై ప్రభావం
- రేడియో కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలపై ఫోన్ సిగ్నల్స్ ప్రభావం
విమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టమని సిబ్బంది పదేపదే చెబుతుంటారు. ఇది కేవలం ఓ సాధారణ నిబంధన కాదు. ఫోన్ సిగ్నల్స్ వల్ల విమానంలోని కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో పాటు.. నేలపై ఉన్న మొబైల్ నెట్‌వర్క్‌లపై అదనపు భారం పడకుండా చూసేందుకు ఈ సూచన చేస్తారు.
ఫోన్ సిగ్నల్స్‌తో ఏం జరుగుతుంది?
విమానంలో ఫోన్ మొబైల్ నెట్‌వర్క్ కోసం నిరంతరం సిగ్నల్స్ వెతుకుతుంటుంది. విమానం వేల అడుగుల ఎత్తులో వేగంగా ప్రయాణిస్తుండటంతో.. ఫోన్ ఒక సెల్ టవర్ నుంచి మరో టవర్‌కు కనెక్షన్ కోసం ప్రయత్నిస్తుంది. దీంతో రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
పైలట్ హెడ్‌సెట్‌లో శబ్దాలు
మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ కొన్నిసార్లు పైలట్ హెడ్‌సెట్‌లో అనవసర శబ్దాలకు కారణం కావచ్చు. స్పీకర్ దగ్గర ఫోన్ ఉంచినప్పుడు వినిపించే బజ్ శబ్దం మాదిరిగా ఇది ఉంటుంది. కీలక సమయాల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వచ్చే సూచనలు స్పష్టంగా వినిపించకపోయే ప్రమాదం ఉండటంతో.. ఇలాంటి అంతరాయాలను నివారించేందుకు ఎయిర్‌ప్లేన్ మోడ్ ఉపయోగించాలని సూచిస్తారు.
నావిగేషన్ వ్యవస్థలకూ రక్షణ
విమానాన్ని సురక్షితంగా నడిపేందుకు పైలట్లు రేడియో కమ్యూనికేషన్, నావిగేషన్ పరికరాలపై ఆధారపడతారు. ఫోన్ సిగ్నల్స్ వల్ల ఎలాంటి ఎలక్ట్రానిక్ అంతరాయం కలగకుండా ఉండటం ఈ వ్యవస్థల పనితీరుకు ఉపయోగపడుతుంది.
నేలపై ఉన్న నెట్‌వర్క్‌పై భారం
విమానం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు యాక్టివ్‌గా ఉన్న ఫోన్ అనేక సెల్ టవర్లను గుర్తించి కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించవచ్చు. విమానంలోని వందలాది మంది ప్రయాణికుల ఫోన్లు ఒకేసారి ఇలా ప్రయత్నిస్తే.. నేలపై ఉన్న మొబైల్ నెట్‌వర్క్‌లపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది.
5జీ సిగ్నల్స్ విషయంలో ఎందుకు జాగ్రత్త?
5జీలోని కొన్ని సీ-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలు విమానాల్లో ఉపయోగించే రాడార్ ఆల్టీమీటర్ ఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉంటాయి. ఈ పరికరాలు విమానం భూమికి ఎంత ఎత్తులో ఉందో కచ్చితంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో వీటి కచ్చితత్వం చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఫోన్ ఆన్‌లో ఉంటే వాటికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
అందుకే విమాన ప్రయాణంలో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం సాధారణ నిబంధనలా కనిపించినా.. దాని వెనుక కమ్యూనికేషన్ అంతరాయాలు, నెట్‌వర్క్ భారం, విమాన నావిగేషన్ వ్యవస్థల భద్రత వంటి పలు కారణాలు ఉన్నాయి.