జర్మనీలో రూ.77 లక్షల జీతం.. చేతిలో మిగిలేది సున్నా.. ఓ భారతీయుడి రియాలిటీ చెక్!
- 40 శాతం పన్నులు, అధిక అద్దెలతో ఆదా కష్టమంటున్న తనుజ్
- జర్మనీ జీతం భారత్‌లో రూ.35 లక్షలతో సమానమని విశ్లేషణ
- డబ్బు మాత్రమే కాదు, కెరీర్ కూడా ముఖ్యమంటున్న నెటిజన్లు
- జర్మనీలో ఉద్యోగాలకు భాషా నైపుణ్యం తప్పనిసరి అని సూచనలు
విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం అనగానే చాలామంది అదో కలల ప్రపంచం అని భావిస్తారు. కానీ, అక్కడి వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, కాగితంపై కనిపించే అంకెలకు, చేతికి అందే మొత్తానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని ఓ భారతీయుడు తన అనుభవంతో వివరిస్తున్నాడు. జర్మనీలో ఆరేళ్ల పాటు నివసించిన తనుజ్ అనే వ్యక్తి, యూరప్ వెళ్లాలని కలలు కంటున్న వారికి ఒక 'రియాలిటీ చెక్' ఇస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఖర్చుల లెక్క ఇదే..
జర్మనీలో వార్షిక జీతం 70,000 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ. 77లక్షలు) అంటే చాలా పెద్ద మొత్తంగా అనిపిస్తుందని, కానీ అసలు లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని తనుజ్ తన 'ఎక్స్' (ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం.. జీతంలో దాదాపు 40 శాతం పన్నులకే పోతుంది.
దీనికి తోడు ప్రధాన నగరాల్లో ఇంటి అద్దె నెలకు 1,500 యూరోల (సుమారు రూ. 1.65 లక్షలు) వరకు ఉంటుంది. ఇవి కాకుండా విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు, ఆరోగ్య బీమా ప్రీమియంలు, బయట తినాలంటే అయ్యే ఖర్చు, ఇతర సర్వీసులకు చెల్లించాల్సిన అదనపు ఛార్జీలు కూడా చాలా అధికంగా ఉంటాయని వివరించారు.
'పర్చేజింగ్ పవర్ ప్యారిటీ' (పీపీపీ) ప్రకారం ఈ జీతాన్ని పోల్చి చూస్తే.. "జర్మనీలో 70,000 యూరోల జీతం, భారతదేశంలో సుమారు రూ. 32-35 లక్షల వార్షిక జీతంతో సమానం" అని తనుజ్ అభిప్రాయపడ్డారు. అందువల్ల, "భారత్‌లో మంచి జీతంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలి వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. తర్వాత బాధపడే బదులు, ఇప్పుడే తెలివైన నిర్ణయం తీసుకోండి" అని ఆయన సూచించారు.
ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు
ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చనీయాంశం కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. చాలామంది తనుజ్ చెప్పిన విషయాలతో ఏకీభవించారు. "జీతాన్ని నేరుగా మార్పిడి చేసుకోవడం సరైన పద్ధతి కాదు. పన్నులు, అద్దె, బీమా, రోజువారీ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది" అని ఒకరు వ్యాఖ్యానించారు. "చాలామందికి పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనే విషయం తెలియదు" అని మరో యూజర్ పేర్కొన్నారు.
అయితే, మరికొందరు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. "విదేశాలకు వెళ్లడం ఎప్పుడూ డబ్బు కోసమే కాదు. మంచి కంపెనీలో పనిచేయడం, కెరీర్ ఎదుగుదల, మెరుగైన జీవన ప్రమాణాలు కూడా ముఖ్యమే" అని ఒకరు అన్నారు. "కెరీర్ కోసం కొన్ని సర్దుబాట్లు, రాజీలు తప్పవు" అని మరొకరు కామెంట్ చేశారు.
ఇదే చర్చలో భాగంగా మరో యూజర్, జర్మనీలో ప్రస్తుతం ఆంగ్లం మాట్లాడేవారికి ఉద్యోగావకాశాలు తగ్గాయని, సీ1 స్థాయి జర్మన్ భాష వచ్చి ఉండటం తప్పనిసరి అని తెలిపారు. నర్సింగ్, కమర్షియల్ ట్రక్ డ్రైవర్లు, కార్పెంటర్ల వంటి వృత్తులకు ఆదరణ ఉందని, వృత్తి విద్యా కోర్సుల (Ausbildung) కోసం కనీసం బీ2 స్థాయి జర్మన్ భాషా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మొత్తం మీద విదేశీ ఉద్యోగం అనేది కేవలం జీతం లెక్కలతో కాకుండా, అనేక వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని తీసుకోవాల్సిన కీలక నిర్ణయమని ఈ చర్చ స్పష్టం చేస్తోంది.