ఈ కుర్చీ చాలా స్ట్రాంగ్.. డ్యాన్స్ చేసి మరీ నిరూపించిన వ్యాపారి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ కుర్చీ చాలా స్ట్రాంగ్.. డ్యాన్స్ చేసి మరీ నిరూపించిన వ్యాపారి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

Plastic chair vendor proves durability by dancing on it in viral video
  • ప్లాస్టిక్ కుర్చీ మ‌న్నిక‌ను చూపించేందుకు వ్యాపారి వినూత్న ప్రదర్శన
  • కుర్చీపై ఎక్కి గెంతులు, డ్యాన్స్ చేసిన అమ్మకందారుడు
  • వ్యాపారి బరువుకు కుర్చీ వంగినా విరిగిపోకపోవడం విశేషం
  • వ్యాపారి వీడియో ప్రస్తుతం నెట్టింట‌ వైరల్‌
  • అమ్మకందారుడి తెలివిని మెచ్చుకుంటున్న నెటిజన్లు
తమ వస్తువులను అమ్ముకోవడానికి వ్యాపారులు రకరకాల ప్రచారాలు చేస్తుంటారు. అయితే, ఓ ప్లాస్టిక్ కుర్చీల అమ్మకందారుడు తన ఉత్పత్తి నాణ్యతను నిరూపించడానికి చేసిన వినూత్న ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొనుగోలుదారులను నమ్మించడం కోసం అతను ఏకంగా కుర్చీపై ఎక్కి డ్యాన్స్ చేశాడు.

సాజిద్ త్యాగి అనే యూజర్ 'ఎక్స్‌' (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోలో ఓ వ్యాపారి మొదట తేలికపాటి ప్లాస్టిక్ కుర్చీని కర్రతో పలుమార్లు కొడతాడు. అనంతరం దానిపైకి ఎక్కి నిలబడి, తన బరువును బ్యాలెన్స్ చేసుకుంటూ గెంతడం, డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. అతని బరువుకు కుర్చీ కాళ్లు బాగా వంగినప్పటికీ, అది ఏమాత్రం విరిగిపోలేదు.

కుర్చీ మ‌న్నిక‌ను, ఫ్లెక్సిబిలిటీని ప్రత్యక్షంగా చూపించేందుకు ఈ 'లైవ్ స్ట్రెస్ టెస్ట్' చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. 

"అనుభవమున్న అమ్మకందారులకు వస్తువు విరగకుండా దానిపై బలాన్ని ఎలా ప్రదర్శించాలో బాగా తెలుసు" అని ఒకరు వ్యాఖ్యానించగా, "ఇది వీధుల్లో జరిగే సాధారణ సేల్స్ ట్రిక్" అని మరికొందరు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ వ్యాపారి ఎవరు అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
Advertisement
Plastic chair vendor
Viral dance video
Durable plastic chair
Sajid Tyagi
Street marketing trick
Social media viral video

More Telugu News