తేరగా తిండి దొరుకుతుందంటే ఎవరి పెళ్లిలోనైనా దూరిపోయేవాడ్ని: అనిల్ కపూర్
- చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న అనిల్ కపూర్
- ఫ్రీ ఫుడ్, కూల్ డ్రింక్స్ కోసం పిలవని పెళ్లిళ్లకు వెళ్లేవాడినని వెల్లడి
- చెంబూర్‌లోని పెళ్లిళ్లలో స్నేహితులతో కలిసి వెళ్లేవాడినని వ్యాఖ్య
- 11-12 గోల్డ్ స్పాట్, మంగోలా బాటిళ్లు తాగేవాళ్లమని గుర్తుచేసుకున్న స్టార్
సీనియర్ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన కొత్త షో ప్రమోషన్‌లో భాగంగా ఒక సరదా విషయాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు తాను, తన స్నేహితులు ఫ్రీ ఫుడ్, కూల్ డ్రింక్స్ కోసం పిలవని పెళ్లిళ్లకు కూడా వెళ్లేవాళ్లమని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘ఇండియా కే టాప్ 1%’ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన, ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తాను ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న తిలక్ నగర్‌లో నివసించే రోజుల్లో ఈ సంఘటనలు జరిగాయని అనిల్ కపూర్ తెలిపారు. ఆ ప్రాంతంలో తరచూ చిన్న, పెద్ద పెళ్లిళ్లు జరుగుతుండేవని, దాంతో తమకు మంచి అవకాశం దొరికేదని అన్నారు. "ఫ్రీగా వచ్చేది ఎవరికి ఇష్టం ఉండదు? ఉచితంగా బహుమతి వచ్చినా, భోజనం దొరికినా ఎవరైనా వెళ్తారు. మేం కూడా అలాగే పెళ్లి మండపంలోకి వెళ్లిపోయేవాళ్లం" అని నవ్వుతూ చెప్పారు.
అక్కడ అందరినీ తెలిసిన వాళ్లలాగా "నమస్తే, నమస్తే, ఎలా ఉన్నారు?" అంటూ పలకరిస్తూ నేరుగా ఫుడ్ కౌంటర్ దగ్గరకు వెళ్లిపోయేవాళ్లమని ఆయన వివరించారు. ముఖ్యంగా తాను గోల్డ్ స్పాట్, మంగోలా వంటి కూల్ డ్రింక్స్ తాగడానికే వెళ్లేవాడినని, ఒక్కొక్కరం 11-12 బాటిళ్లను తాగేసేవాళ్లమని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన సరదాగా వ్యాఖ్యానిస్తూ, "‘బేగానీ షాదీ మే అబ్దుల్లా దీవానా’ అనే సామెత మీరు వినే ఉంటారు. కానీ, నిజానికి అది ‘బేగానీ షాదీ మే అనిల్ కపూర్ దీవానా’ అని ఉండాలి" అంటూ తనపై తానే జోక్ చేసుకున్నారు. అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్న ‘ఇండియా కే టాప్ 1%’ షో సెప్టెంబర్ 19 నుంచి స్టార్ ప్లస్, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.