రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు తిన్న ఆహార పదార్థాలు ఇవే!
- సైనికుల అవసరాన్ని బట్టి సి,డి,కె రేషన్‌గా విభజన
- సి-రేషన్‌లో క్యాన్‌లో భద్రపరిచిన మాంసం, కూరగాయలతో కూడిన కూర
- తక్కువ బరువుతో ఎక్కువ దూరం వెళ్లాల్సిన సైనికుల కోసం కె-రేషన్
- ఇందులో బిస్కెట్లు, ప్రాసెస్డ్ చీజ్ లేదా మాంసం, పానీయాలు, చాక్లెట్, చూయింగ్ గమ్, కాఫీ
- డి-రేషన్ చాక్లెట్ బార్‌తో అధిక కేలరీలు
రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు ఆహారం అంటే రుచి కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండటం, సులభంగా తీసుకెళ్లడం, ఎక్కువ శక్తినివ్వడం ముఖ్యం. యుద్ధభూముల్లో తాజా ఆహారం, వంట సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో అమెరికా సహా పలు దేశాల సైన్యాలు ప్రత్యేక రేషన్ ప్యాక్‌లను సిద్ధం చేశాయి. క్యాన్లలో మాంసం నుంచి గట్టి బిస్కెట్లు, చాక్లెట్, ఇన్‌స్టంట్ కాఫీ వరకు ఎన్నో రకాల ఆహారాలు సైనికుల రేషన్‌లో భాగమయ్యాయి.
డి, సి, కె రేషన్‌లుగా విభజన
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం సైనికుల అవసరాలను బట్టి రేషన్‌లను వేర్వేరు కేటగిరీలుగా రూపొందించింది. డి-రేషన్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే అధిక శక్తి ఆహారం కాగా, సి-రేషన్ రోజువారీ భోజనానికి సరిపోయే క్యాన్డ్ మీల్‌గా రూపొందింది. కె-రేషన్ మాత్రం తక్కువ బరువుతో సులభంగా తీసుకెళ్లేందుకు, ముఖ్యంగా వేగంగా కదిలే సైనికుల కోసం తయారు చేశారు. అమెరికా ఆర్మీ చారిత్రక రికార్డులు కూడా వీటిని ప్రత్యేక సైనిక రేషన్ కేటగిరీలుగా పేర్కొంటున్నాయి.
ఒక రోజు రేషన్ తో దాదాపు 3,700 కేలరీల శక్తి
అమెరికా సైనికుల సి-రేషన్‌లో క్యాన్‌లో భద్రపరిచిన మాంసం, కూరగాయలతో కూడిన కూర ప్రధానంగా ఉండేవి. టొమాటో సాస్‌లో మీట్, మీట్ నూడుల్స్, పోర్క్ అండ్ బీన్స్, చికెన్, వెజిటబుల్స్ వంటి వంటకాలు కూడా ఉండేవి. ఒక రోజు రేషన్ దాదాపు 3,700 కేలరీల శక్తిని అందించేది. ఫ్రిజ్ లేదా ప్రత్యేక వంట సదుపాయం అవసరం లేకపోవడం వీటి ప్రధాన ప్రయోజనం.
కె-రేషన్ బిస్కెట్లు
తక్కువ బరువుతో ఎక్కువ దూరం వెళ్లాల్సిన సైనికుల కోసం కె-రేషన్ రూపొందించారు. ఇందులో బిస్కెట్లు, ప్రాసెస్డ్ చీజ్ లేదా మాంసం, పానీయాలు, చాక్లెట్, చూయింగ్ గమ్, కాఫీ ఉండేవి. రోజుకు మూడు ప్యాకెట్లుగా ఇచ్చే ఈ రేషన్ సుమారు 2,830 కేలరీలు అందించేది. బిస్కెట్లు ఎక్కువకాలం పాడవకుండా ఉండేవి.
ప్రత్యేకమైన డి-రేషన్ చాక్లెట్
రెండో ప్రపంచ యుద్ధంలో చాక్లెట్ కేవలం తీపి పదార్థమే కాదు. ఇన్‌స్టంట్ ఎనర్జీ ప్రధాన సోర్స్. అమెరికా సైన్యం రూపొందించిన డి-రేషన్ చాక్లెట్ బార్ అధిక కేలరీలను అందించడంతో పాటు వేడి, రఫ్ హ్యాండ్లింగ్‌ను తట్టుకునేలా తయారు చేశారు. ఉద్దేశపూర్వకంగానే సాధారణ చాక్లెట్‌లా రుచిగా ఉండకుండా తయారు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సైనికులు తినాలన్నది దీని ఉద్దేశం.
క్యాన్ చేసిన మాంసం
క్యాన్ చేసిన మాంసం యుద్ధకాల ఆహారంలో కీలకంగా మారింది. ఫ్రిజ్ అవసరం లేకుండా ఎక్కువకాలం నిల్వ ఉండటం వల్ల యుద్ధభూములకు తరలించడం సులభమైంది. క్యాన్ నుంచే నేరుగా తినడం లేదా ఇతర వంటకాల్లో కలుపుకోవడం చేసేవారు.
ఇన్‌స్టంట్ కాఫీ
సైనికులకు కాఫీ కేవలం పానీయం కాదు.. యుద్ధం మధ్యలో సాధారణ జీవితాన్ని గుర్తుచేసే చిన్న అలవాటు. కే-రేషన్‌లో కాఫీ ఉండేది. సి-రేషన్‌లో కాఫీ పొడిని ఇచ్చేవారు. తక్కువ సామగ్రితో వేడి కాఫీ తయారు చేసుకునే అవకాశం సైనికులకు కొంత మానసిక ఉపశమనాన్ని కూడా ఇచ్చేది.
గట్టి బిస్కెట్లు, క్రాకర్లు
తాజా బ్రెడ్ త్వరగా పాడైపోయే పరిస్థితుల్లో హార్డ్ బిస్కెట్లు, క్రాకర్లు సైనికులకు ఉపయోగపడేవి. తక్కువ స్థలం ఆక్రమించడం, సులభంగా తీసుకెళ్లడం, ఎక్కువకాలం నిల్వ ఉండటం వీటి ప్రత్యేకత. రుచి కోసం కాకుండా యుద్ధభూమి పరిస్థితులను తట్టుకుని చివరి వరకు తినదగిన ఆహారంగా వీటిని తయారు చేశారు.