- ప్యూర్టోరికోలో జరగనున్న 75వ ఎడిషన్ మిస్ యూనివర్స్ 2026 పోటీ
- భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కజియా లిజ్ మెజో
- కేరళ నుంచి మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలిచిన తొలి యువతి
- 19 ఏళ్ల కజియా ప్రస్తుతం న్యాయశాస్త్ర విద్యార్థిని
- శాస్త్రీయ నృత్యం, సంగీతంలోనూ అపారమైన ప్రతిభ
75వ మిస్ యూనివర్స్ పోటీల్లో విశ్వ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేసేందుకు 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' విజేత కజియా లిజ్ మెజో ప్యూర్టోరికో బయల్దేరి వెళ్లింది. కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా, ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. కేరళ నుంచి మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తొలి యువతిగా ఆమె ఇప్పటికే చరిత్ర సృష్టించింది.
బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమె ప్యూర్టోరికా పయనమైంది. ఈ సందర్భంగా మిస్ యూనివర్స్ ఇండియా సంస్థ ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. మెరూన్ రంగు చీరలో, తలపై కిరీటంతో, మెడలో భారీ నెక్లెస్‌తో సంప్రదాయబద్ధంగా ముస్తాబై కజియా ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించింది. భారత జాతీయ జెండాను చేతబట్టి ఆమె ఇచ్చిన ఫోజులు దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబించాయి.
"ఒక రాణి కిరీటాన్ని మాత్రమే కాదు, ఒక దేశపు కలలు, ఆశలను కూడా మోసుకెళుతుంది. సంప్రదాయంతో, పేరుప్రతిష్ఠలతో కజియా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది" అని మిస్ యూనివర్స్ ఇండియా సంస్థ ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు 'డిస్కవర్ ప్యూర్టోరికో' స్పందిస్తూ ఆమెకు స్వాగతం పలికింది.
2007లో జన్మించిన కజియా, తన బాల్యాన్ని అబుదాబిలో గడిపిందివ. 17 ఏళ్ల వయసులోనే 'మిస్ టీన్ దివా 2024' టైటిల్‌ను, 'మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025'లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకుంది. మోడలింగ్‌తో పాటు ఆమె ప్రస్తుతం న్యాయశాస్త్రం అభ్యసిస్తోంది. 12 ఏళ్లుగా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన కజియా, వయోలిన్, డ్రమ్స్ వాయించడంలో, గాత్రంలోనూ ప్రావీణ్యం సంపాదించింది.
75వ మిస్ యూనివర్స్ పోటీలు ప్యూర్టోరికోలోని శాన్ జువాన్‌లో ఉన్న జోస్ మిగెల్ అగ్రెలట్ కొలిజియంలో అట్టహాసంగా జరగనున్నాయి. నవంబర్ 24న ఫైనల్ జరగనుండగా, దాదాపు 130 దేశాల నుంచి సుందరీమణులు ఇందులో పాల్గొననున్నారు.

.