- ఆర్టీసీ ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్న పొన్నం
- ఉద్యోగులు ఎక్కడైనా తప్పుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచన
- ఉద్యోగులను కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని పేర్కొన్న మంత్రి
- ఉచిత బస్సు వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రకటన
- ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబానికి నియామక పత్రం
ఆర్టీసీ ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఉద్యోగులు ఎక్కడైనా తప్పుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప దాడులకు దిగవద్దని ప్రజలకు సూచించారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ బాధ్యత అయితే, ఉద్యోగులను కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, కొత్త బస్సుల కొనుగోలు, బస్టాండ్ల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేసి ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఆయన కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ ఇప్పటికే పరిహారం అందించాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం ద్వారా సుమారు రూ.కోటి సాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆయన కుమారుడికి ఉద్యోగం కల్పించామని చెప్పారు.