ఢిల్లీ పోలీసుల్లా ప్రవర్తించొద్దు.. తన భద్రతా అధికారిపై అభిజీత్ దీప్కే ఆగ్రహం
- తన భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిజీత్ డిప్కే
- అతిథులను కలవకుండా ఎస్ఐ అడ్డుకుంటున్నారని ఆరోపణ
- ఢిల్లీ పోలీసుల్లా ప్రవర్తించొద్దంటూ అధికారిపై ఫైర్
- అతడిని విధుల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న ఓ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చే సందర్శకుల పట్ల సదరు అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వెంటనే అతడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నీట్ పేపర్ లీక్ వంటి విద్యార్థి సమస్యలపై పోరాటం ద్వారా 30 ఏళ్ల అభిజీత్ దీప్కే ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆన్‌లైన్‌లో బెదిరింపులు రావడంతో వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అయితే, మఫ్టీలో ఉన్న సురేశ్ అనే ఎస్ఐ తనను కలిసేందుకు వచ్చే వారిని లోపలికి రానీయకుండా ఆటంకం కలిగిస్తున్నారని దీప్కే ఆరోపించారు.
వైరల్ అవుతున్న ఓ వీడియోలో అభిజీత్ దీప్కే సదరు ఎస్ఐని నిలదీస్తూ,"నేను రమ్మని పిలుస్తున్నప్పుడు ప్రజలను అనుమతించడానికి మీకేంటి ఇబ్బంది? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్యా తలెత్తలేదు, మిమ్మల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. నేను ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు అనేది మీరు నిర్ణయించలేరు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.
మరో వీడియోలో ఆయన ఓ ఉన్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడుతూ, "సురేశ్ అనే ఎస్ఐ ఇక్కడ చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా? ఆయన నాకు వద్దు, వెంటనే ఇక్కడి నుంచి తొలగించండి" అని కోరారు.
అంతేకాకుండా, రాష్ట్ర సీఐడీకి చెందిన సిబ్బంది మఫ్టీలో తన ఇంటి పరిసరాల్లో ఉంటూ 'హిట్ స్ప్రే' అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారని దీప్కే ఆరోపించారు. ఓ విలేకరి ఒక అధికారి ఫోన్‌లో ఈ గ్రూప్‌ను గమనించారని ఆయన పేర్కొన్నారు.