- లోక్‌సభ స్థానాల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
- సభలో సభ్యుల సంఖ్య పెరిగితే ప్రజా సమస్యలపై లోతైన చర్చలు జరగడం కష్టమని వ్యాఖ్య
- మంత్రులను ప్రశ్నలు అడిగే అవకాశాన్ని సభ్యులు కోల్పోతారన్న థరూర్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నూతన డీలిమిటేషన్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కేంద్రం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కాకుండా స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తోందా అని ప్రశ్నించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచేలా కేంద్రం 132వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తోంది. దీని ద్వారా లోక్‌సభ గరిష్ఠ సంఖ్యాబలం 543 నుంచి 850కి పెరుగుతుంది. ఈ పునర్విభజనను 2051 వరకు కొనసాగించాలని బిల్లులో ప్రతిపాదించారు.
దీనిపై స్పందించిన థరూర్... ప్రస్తుతం 540 మంది సభ్యులతోనే సభ సజావుగా సాగడం కష్టంగా ఉందని, అలాంటిది 800 మందికి పైగా ఎంపీలు ఉంటే చర్చలకు ఎంతవరకు సమయం లభిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. సభ్యుల సంఖ్య పెరిగితే మంత్రులను ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతారని, సభ్యులు చప్పట్లు కొట్టడానికే పరిమితమవుతారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, మహిళా సాధికారతకు కీలకమైన ఈ బిల్లుపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని, మహిళల సాధికారతకు ఆటంకం కలిగించకూడదని ఆయన స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దెబ్బతినకుండా ఉండేందుకే సమానంగా 50 శాతం సీట్లు పెంచుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు ప్రయత్నిస్తుండగా, కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఈ బిల్లుకు మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.