Ponnam Prabhakar: బండి సంజయ్, గంగుల తీరుతో కరీంనగర్ అవినీతిమయమైంది: పొన్నం ప్రభాకర్

Karimnagar Became Corrupt Due to Bandi Sanjay Gangula Says Ponnam Prabhakar
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వీరి తీరుతో కరీంనగర్ అవినీతిమయమయిందని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్ల డీల్ చేసుకుందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 

కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని పొన్నం మండిపడ్డారు. ఈ పార్టీల పరస్పర అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆరోపించారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ తీరుతో జిల్లా అవినీతిమయంగా మారిందని అన్నారు. పదేళ్లలో కరీంనగర్ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందని చెప్పారు. జిల్లా పరిధిలోని కొండగట్టు, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
Ponnam Prabhakar
Bandi Sanjay
Gangula Kamalakar
Karimnagar
Telangana
Corruption
BRS
BJP
Kondagattu
Vemulawada Temple

More Telugu News