- బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్ అడ్డగింత
- ఎలహంక ప్యాలెస్‌లోకి ప్రవేశం లేదంటూ పోలీసుల స్పష్టీకరణ
- కోర్టు ఆదేశాల నేపథ్యంలో నగరంలోని హోటల్‌కు షర్మిల తరలింపు
- ప్యాలెస్ లీజు వివాదంపై కోర్టును ఆశ్రయించిన సిలికాన్ బిల్డర్స్
- కేసు తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసిన కోర్టు
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ సమేతంగా నగరానికి చేరుకున్న ఆమెను జగన్ నివాసం ఉంటున్న యలహంక ప్యాలెస్ వైపు వెళ్లకుండా పోలీసులు నిలువరించారు. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నందున ప్యాలెస్‌లోకి ప్రవేశించడానికి అనుమతి లేదని స్పష్టం చేస్తూ, ఆమె కాన్వాయ్‌ను దారిమళ్లించారు. ఈ క్రమంలో విమానాశ్రయం వెలుపల పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కుటుంబంలో జరగనున్న వివాహ ఏర్పాట్లకు సంబంధించి షర్మిల తన తల్లి వైఎస్ విజయమ్మ, కుమారుడు, కోడలితో కలిసి బెంగళూరు చేరుకున్నారు. అయితే విమానాశ్రయం నుంచి వాహనాల్లో బయలుదేరిన వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. యలహంక వైపు వెళ్లే మార్గాన్ని కాదని, వాహనాలను బెంగళూరు నగరం వైపు మళ్లించారు. కోర్టు ఆదేశాలను పాటించాలని సూచిస్తూ ఆమెను నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విమానాశ్రయంతో పాటు యలహంక ప్యాలెస్ పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వివాదం వెనుక న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. షర్మిల పర్యటన నేపథ్యంలో, జగన్ వర్గం తరఫున సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భీమిశెట్టి రమేశ్ బాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలను పరిశీలించిన న్యాయస్థానం.. వైఎస్ షర్మిల గానీ, ఆమె అనుచరులు గానీ యలహంక ప్యాలెస్‌లోకి ప్రవేశించకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో భాగంగానే పోలీసులు విమానాశ్రయం వద్ద షర్మిలను అడ్డుకుని వెనక్కి పంపారు.