- టామ్‌కామ్ ద్వారా 16 దేశాల్లో 14,850 మందికి విదేశీ ఉద్యోగాలు
- కొలువులు పొందిన వారిలో 90 శాతం మహిళలేనని వెల్లడి
- టామ్‌కామ్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి
- హైదరాబాద్‌లో దేశంలోనే తొలి ప్రభుత్వ జర్మన్ లాంగ్వేజ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు
- నకిలీ ఏజెంట్ల మోసాల నుంచి రక్షణకు శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్), విదేశీ ఉపాధి కల్పనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 16 దేశాల్లో 14,850 మందికి సురక్షితమైన ఉద్యోగాలు కల్పించినట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన జాతీయ స్థాయి 'చింతన్ శిబిరం'లో టామ్‌కామ్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయని ఆయన తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగాలు పొందిన వారిలో 90 శాతం మంది మహిళలే కావడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. గల్ఫ్, యూకే, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాల్లో మన యువత పనిచేస్తోందని చెప్పారు. వైద్యం, నిర్మాణం, రవాణా సహా 10 కీలక రంగాల్లో కేంద్ర విదేశాంగ శాఖ గుర్తింపుతో, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు చేపడుతున్నట్టు వివరించారు. రాష్ట్రాల కార్మిక మంత్రుల జాతీయ సదస్సులో టామ్‌కామ్ పనితీరును కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా అభినందించారని మంత్రి వివేక్ తెలిపారు.
విదేశీ ఉపాధిని ప్రోత్సహించేందుకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద రూ. 50 కోట్లు కేటాయించామని, వీసా, ప్రయాణ ఖర్చుల కోసం 50 శాతం ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి అన్నారు. దీంతో పాటు, ఉద్యోగాలకు అవసరమైన భాషా నైపుణ్యాల కోసం రూ. 20 కోట్లతో జర్మన్, జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇఫ్లూ భాగస్వామ్యంతో ఆరు క్లస్టర్లలో జర్మన్ భాషా శిక్షణ అందిస్తున్నామని, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారిక జర్మన్ లాంగ్వేజ్ టెస్టింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
నకిలీ ఏజెంట్ల బారిన పడి యువత మోసపోకుండా ఉండేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో 24 గంటల పాటు పనిచేసే వలస కార్మికుల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాలతో నేరుగా ప్రభుత్వ స్థాయిలోనే ఒప్పందాలు కుదుర్చుకుని, వైద్య, నిర్మాణ రంగాల్లో నిపుణులను పంపిస్తున్నామని, ఇది యువతకు సురక్షితమైన భవిష్యత్తును అందిస్తుందని మంత్రి వివేక్ భరోసా ఇచ్చారు.