- వందే భారత్ రైలులో వడ్డించిన వడలో పెద్ద మెటల్ బోల్ట్ గుర్తింపు
- బెంగళూరు నుంచి బెళగావి వెళుతున్న ప్రయాణికుడికి చేదు అనుభవం
- వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమర్థ్ కొడియాల్ అనే ప్రయాణికుడు
- ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పిన ఐఆర్‌సీటీసీ యాజమాన్యం
- క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టీకరణ
- వందే భారత్ ఆహార నాణ్యతపై నెట్టింట నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
బెంగళూరు నుంచి బెళగావి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అల్పాహారంలో వడ్డించిన వడ లోపల ఏకంగా పెద్ద మెటల్ బోల్ట్ ప్రత్యక్షమైంది. కంగుతిన్న ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రైల్వే వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఐఆర్‌సీటీసీ, సంబంధిత క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌పై కఠిన చర్యలు చేపట్టింది.
సమర్థ్ కొడియాల్ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ వేదికగా ఈ దృశ్యాలను పంచుకున్నాడు. ప్లేటులోని వడను రెండు ముక్కలుగా చేసి, దాని లోపల ఉన్న పెద్ద బోల్ట్‌ను పక్కన పెట్టి వీడియోలో చూపించాడు. ఆహార నాణ్యతలో ఇది అత్యంత ఘోరమైన లోపమని మండిపడ్డాడు. రైల్వే శాఖ వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు రైల్వే ఆహార నాణ్యతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదుపై ఐఆర్‌సీటీసీ వెంటనే స్పందించింది. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరింది. బాధ్యులైన సర్వీస్ ప్రొవైడర్‌పై జరిమానాతో కూడిన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. కిచెన్లలో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. మరోవైపు ఎంత టికెట్ ధర చెల్లించినా నాణ్యమైన ఆహారం లభించడం లేదని, ఆహార తయారీ కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నెటిజన్లు రైల్వే శాఖను నిలదీస్తున్నారు.