- ఎస్పీ ఏకపక్షంగా ఐదుగురు అభ్యర్థుల ప్రకటన
- కాంగ్రెస్ అడుగుతున్నది 100 పైగా.. ఎస్పీ ఇస్తామనేది 26 సీట్లే
- ఇమ్రాన్ మసూద్ ఇలాకా సహారన్పుర్లోనూ ఎస్పీ అభ్యర్థి
- "మేము బిచ్చగాళ్లం కాదు" అంటూ ఇమ్రాన్ మసూద్ ఫైర్
- ఎస్పీకి వ్యతిరేకంగా సొంత అభ్యర్థులను దించే యోచన
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు తీవ్ర వివాదానికి దారితీశాయి. చర్చలు కొలిక్కి రాకముందే ఎస్పీ ఏకపక్షంగా ఐదుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము 100కు పైగా స్థానాలు అడుగుతుంటే ఎస్పీ కేవలం 26 సీట్లే ఆఫర్ చేయడంపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది.
చర్చలు కొనసాగుతుండగానే పశ్చిమ యూపీకి చెందిన నాలుగు స్థానాలు సహా ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. బెహట్ నుంచి ఉమర్ అలీ, సహారన్‌పుర్ నుంచి ఆషూ మాలిక్, కైరానా నుంచి నాహిద్ హసన్, అమ్రోహా నుంచి మెహబూబ్ అలీ (వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు), ఝాన్సీలోని లలిత్‌పుర్ నుంచి జ్యోతి లోధిల పేర్లను ఖరారు చేశారు. ఇందులో సహారన్‌పుర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ పరిధిలోకి వస్తుంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ముస్లిం, దళిత ఓటర్లు అధికంగా ఉండటంతో, వీటిలో కనీసం రెండింటిని కాంగ్రెస్ ఆశించింది.
ఎస్పీ ఏకపక్ష వైఖరిపై ఇమ్రాన్ మసూద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "మేము బిచ్చగాళ్లం కాదు.. అఖిలేశ్ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడటం లేదు" అంటూ మండిపడ్డారు. చర్చలు ముగియకముందే పేర్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తూ, తాము కూడా అదే స్థానాల్లో పోటీ చేయగలమని హెచ్చరించారు. సహారన్‌పుర్‌లో ఎస్పీకి పోటీగా అభ్యర్థిని దించే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని యూపీ కాంగ్రెస్ నిర్ణయించింది.
ప్రారంభంలో కాంగ్రెస్ 181 స్థానాలు డిమాండ్ చేయగా, చర్చల్లో దాన్ని 110 సీట్లకు తగ్గించుకుంది. అయినప్పటికీ ఎస్పీ మాత్రం 26 సీట్లకు మించి ఇచ్చేది లేదని మొండికేసింది. మరోవైపు భాజపా ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్ ఎస్పీ, కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఏకాభిప్రాయం అని లేఖ రాస్తూనే, కాంగ్రెస్‌ను అడగకుండా అభ్యర్థులను ప్రకటించి ఎస్పీ ఆ పార్టీని నవ్వులపాలు చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.